మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో పెద్ద డిజాస్టర్ అంటే ‘ఆరెంజ్’ (Orange) మూవీ. ఈ సినిమా దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ను సైతం ఈ సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించిన మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) సైతం అప్పుల పాలు కావాల్సి వచ్చింది. అయితే, ఇదే సినిమా ఇప్పుడు జనసేన పార్టీకి భారీ విరాళాన్ని తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 25న మళ్లీ విడుదలైన ‘ఆరెంజ్’ సినిమా మెగా అభిమానులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యింది. రెండు రోజుల పాటు ప్రదర్శితమైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది.
ఆరెంజ్’ (Orange) మూవీ రీ-రిలీజ్ కలెక్షన్ మొత్తాన్ని జనసేన (Janasena) పార్టీకి విరాళంగా ఇస్తానని మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) గతంలో ప్రకటించారు. అయితే, కలెక్షన్ ఎంత వచ్చింది అనే విషయాన్ని మాత్రం అప్పుడు చెప్పలేదు. మొత్తానికి ఆ కలెక్షన్ మొత్తాన్ని చెక్ రూపంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.
జనసేన ప్రధాన కార్యదర్శి హోదాలో రూ.1.05 కోట్ల చెక్కును తమ అధినేత పవన్ కళ్యాణ్‌కు పార్టీ ఫండ్‌గా నాగబాబు అందజేశారు. అయితే, ‘ఆరెంజ్’ మూవీ రీ-రిలీజ్ చేసి థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించేందుకు మెగా అభిమానులు అయిన సాయి రాజేష్, ధర్మేంద్ర, ఎస్కేఎన్, శివ చెర్రీ, శ్రీనాథ్, ఉమా నాగేంద్ర, శ్రీధర్ కృషి చేశారు. వీరిని నాగాబాబు ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కళ్యాణ్‌కు నాగబాబు చెక్ అందజేసిన సమయంలో వీరంతా ఉన్నారు.