Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (21-05-2023 నుండి 27-05-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం( 21-05-2023 నుండి 27-05-2023 )

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. శుభఫలితం ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్ధంగా ఎదుర్కొంటారు. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగండి . చేసే పనిలో నిపుణత చాలా అవసరం. పట్టు వదలకుండా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది. కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు చాలావరకు మేలుచేస్తాయి. మన పక్కనే ఉంటూ, మనల్ని ఇబ్బంది పెట్టేవారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. శ్రీనవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం ( 21-05-2023 నుండి 27-05-2023 )

విశేష ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. నిర్మలమైన మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. బంధు ప్రీతి కలదు. అపోహలకు తావివ్వకండి స్థిరాస్తి కి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. సూర్య ఆరాధన శుభప్రదం.

🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం ( 21-05-2023 నుండి 27-05-2023 )

అనుకున్నది సాధిస్తారు. మంచి ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో పనిచేసి గొప్ప ఫలితాలను పొందుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అదృష్టప్రాప్తి ఉంది. మంచి సౌఖ్యం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. తోటవారికి సహాయం చేస్తారు. చెప్పిన మాటలు విని ఇబ్బందిపడతారు. అయినవారిని విభేదించరాదు. నిర్మలమైన మనసుతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది . మనోబలం శక్తినిస్తుంది. చంద్ర ఆరాధన శుభప్రదం ..
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం ( 21-05-2023 నుండి 27-05-2023 )

చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత ఉంది. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. నిబద్ధతతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిపుణులు. సలహాలు అక్కరకు వస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం .
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం ( 21-05-2023 నుండి 27-05-2023 )

శుభ ఫలితాలు వచ్చాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధిపథంలో ముందుకు సాగుతారు . మీ రంగాల్లో గొప్ప ఫలితాలను పొందుతారు. అదృష్టవంతమైన కాలం నడుస్తోంది. చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థికయోగాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య ( 21-05-2023 నుండి 27-05-2023 )

ప్రారంభించిన పనుల్లో నిశితంగా ఆలోచించి ముందుకు సా, ఇబ్బందులను అధిగమిస్తారు. సంకల్పబలంతో పనులను ప్రారంభించాలి. అవగాహనతో ముందుకు సాగండి, ఊహించిన ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి .. కుటుంబసభ్యుల సలహాలు మేలు చేస్తాయి. సూర్య స్తోత్రాన్ని చదవాలి .
💃💃💃💃💃💃💃

⚖ తుల ( 21-05-2023 నుండి 27-05-2023 )

చేపట్టే పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. మోసపూరితమైన వాతావరణం నెలకొంటుంది. ఎవరినీ అతిగా నమ్మకండి. అనవసర అంశాల్లో సమయాన్ని వెచ్చించకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్తపడాలి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి .. నవగ్రహ శ్లోకాలను చదివితే మంచిది
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం ( 21-05-2023 నుండి 27-05-2023 )

సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి . ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య విషయాల్లో నిదానంగా మాట్లాడండి. కొన్ని విషయాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.అలసట చెందకుండా చూసుకోవాలి. చైతన్యవంతంగా పనులు చేయాలి. ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే మంచిఫలితాలను పొందుతారు. శ్రీ విష్ణు ఆరాధన ఉత్తమం
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు ( 21-05-2023 నుండి 27-05-2023 )

గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. విశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభ,పనితీరుకు అధికారులు లేదా పెద్దల ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో వల్ల మేలు జరుగుతుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ సహకారం ఉంటుంది. ఆరోగ్యం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం ( 21-05-2023 నుండి 27-05-2023 )

వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి . ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారులవల్ల మేలు జరుగుతుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మీ అభివృద్ధికి అడ్డురావు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు . ఆధ్యాత్మికంగా శుభకాలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది….
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం ( 21-05-2023 నుండి 27-05-2023 )

శుభయోగం ఉంది . అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. మీరు పనిచేసే రంగాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శివ నామస్మరణ శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం ( 21-05-2023 నుండి 27-05-2023 )

అద్భుతమైన విజయాలు ఉన్నాయి. మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. అవసరానికి ధనం అందుతుంది . నిరంతర పరిశ్రమతో గొప్ప ఫలితాలు ఉంటాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అధికార యోగం సూచితం .. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా బాగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధు, మిత్రులు వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్ష్మీదేవి నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది
🦈🦈🦈🦈🦈🦈🦈