Editorials

జ్ఞాపకాలు లేకుండా మనసు ఎలా ఉంటుంది ?

జ్ఞాపకాలు లేకుండా మనసు ఎలా ఉంటుంది ?

“శుద్ధ మనసు అంటే జ్ఞాపకాలు ఏవీ లేని మనసు. మనం ఏది చేయాలనుకుంటున్నామో అదే జ్ఞాపకం వస్తుంది కానీ మనలో ఉన్న జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగారావు. కాబట్టి జ్ఞాపకం అంటే కోరిక. కోరిక, ఆలోచన వేర్వేరు. జీవనం ఉన్నంతకాలం ఆలోచనలు తప్పవు. కానీ జీవనానికి అవసరం లేని కోరికలు జ్ఞాపకానికి కారణమైన మనసు శుద్ధతను భంగపరూస్తున్నాయి. కోరికలేని మనసుకే దైవ దర్శనం అనుభవం అవుతుంది. ఆ స్థితి పొందిన వ్యక్తి జీవనం నిద్రిస్తూ ప్రయాణాన్ని పూర్తి చేసినంత సునాయాసంగా సాగిపోతుంది. జ్ఞాపకాలే మనసు యొక్క శుద్ధతను భంగపరుస్తున్నాయి. ఏ జ్ఞాపకాలు లేని మనసు నిద్రాస్థితిలాంటి హాయినిస్తుంది,, గురువు ఎడల సంపూర్ణ శ్రద్ధాసక్తులు ఉన్నవారికి అవి సులభంగా అందుతాయి !”