బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. మోదీపై డాక్యుమెంటరీతో దేశ ప్రతిష్టను దిగజార్చారని ఆ నోటీసుల్లో తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఎన్జీవో కోర్టులో పిల్ దాఖలు చేసింది.
బీబీసీ(BBC)కి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఇండియా.. ద మోదీ క్వశ్చన్ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన అంశంలో కోర్టు ఈ సమన్లు ఇచ్చింది. డాక్యుమెంటరీతో దేశం పరువు తీశారని బీబీసీపై ఓ ఎన్జీవో పరవునష్టం కేసును దాఖలు చేసింది. గుజరాత్‌కు చెందిన ఎన్జీవో జస్టిస్ ఫర్ ట్రయల్ సంస్థ కోర్టులో కేసు వేసింది. ఈ అంశంలో వివరణ ఇవ్వాలని కోరుతూ జస్టిస్ సచిన్ దత్త బీబీసీకి నోటీసులు ఇచ్చారు. బీబీసీ ఇండియా స్థానిక ఆపరేటర్ అని, బీబీసీ యూకే ఆ డాక్యుమెంటరీని రిలీజ్ చేసినట్లు పరువునష్టం దావాలో తెలిపారు. ఎన్జీవో తరపున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదించారు. దేశ న్యాయవ్యవస్థను కించపరిచే రీతిలో ఆ డాక్యుమెంటరీ ఉన్నట్లు దావాలో పేర్కొన్నారు. ఈ కేసులో సెప్టెంబర్ 15వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్నారు.