Politics

రేపు కడప జిల్లాలో లోకేశ్ పాదయాత్ర…

రేపు కడప జిల్లాలో లోకేశ్ పాదయాత్ర…

 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 107వ రోజు ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా యువనేతను చూసేందుకు . పాదయాత్రకు బయలుదేరే ముందు దొర్నిపాడులో బలిజ సామాజికవర్గీయులతో సమావేశమైన లోకేశ్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు.

అనంతరం ప్రారంభమైన పాదయాత్ర దొర్నిపాడు, రామచంద్రపురం, భాగ్యనగరం, చింతకుంట మీదుగా ఆళ్లగడ్డ శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40 రోజుల పాటు దుమ్ము రేపిన యువగళం పాదయాత్ర… మంగళవారం జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లె వద్ద కడప జిల్లాలోకి ప్రవేశించనుంది.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1378.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.5 కి.మీ.*

*108వ రోజు (23-5-2023) పాదయాత్ర వివరాలు:*

*ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)*

సాయంత్రం

4.00 – ఆళ్లగడ్డ శివారు అపర్ణ ఇన్ ఫ్రా వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.20 – భూమా బాలిరెడ్డి నగర్ లో బుడగజంగాలతో సమావేశం.

4.50 – ఆళ్లగడ్డ 4రోడ్ల సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.

5.10 – గవర్నమెంట్ కాలేజి వద్ద వాల్మీకి బోయలతో సమావేశం.

5.15 – సిఎస్ఐ చర్చి వద్ద క్రిస్టియన్లతో సమావేశం.

5.20 – పాతబస్టాండు వద్ద బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.50 – భూమా ఘాట్ సందర్శన, దివంగత భూమా నాగిరెడ్డి దంపతులకు నివాళులు.

8.00 – చిన్నకందుకూరులో స్థానికులతో సమావేశం.

8.05 – సుద్దపల్లె వద్ద కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోకి ప్రవేశం.

8.35 – సుద్దపల్లెలో స్థానికులతో సమావేశం.

9.35 – సుద్దపల్లె శివారు విడిది కేంద్రంలో బస.