Food

కివీ పండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు…

కివీ పండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు…

కివి పండు ఇప్పుడైతే భారత మార్కెట్ లో విరివిగా దొరుకుతుంది. మార్కెట్ లో దీని ధర యాపిల్ కు సమానం. మన దేశంలో కివి సాగు అంతపెద్దగా లేదుగానీ ఎక్కువగా న్యూజిలాండ్ దేశంలో, చల్లని ప్రదేశాల్లో ద్రాక్షవలె సాగుచేస్తారు. అందుకే న్యూజిలాండ్ క్రికెటర్లను ‘కివీస్’ అంటుంటాం. ఇందులో ఉన్న పోషకాలు, విటమిన్లు మరే పండులో కనిపించవని అంటారు శాస్త్రవేత్తలు.

చూడటానికి సపోట వలె కనిపిస్తుంది కానీ గుడ్డు ఆకారంలో ఉంటుంది. కోసి చూస్తే అనేక గింజలతో నిండిన ఆకుపచ్చ, పసుపు పచ్చని గుజ్జు ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, పీచు పదార్ధం, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. చాలా మంది దీనిని ‘వండర్ ఫ్రూట్’ అంటారు.

కివి పండు ప్రయోజనాలు:

* కొవ్వు, సల్ఫర్ తక్కువగా ఉంటుంది కనుక గుండె, మధుమేహ వ్యాధిగ్రస్థులు తినవచ్చు. బరువు తగ్గించుకోవాలనుకొనేవారు కివి తింటే ఫలితం కనిపిస్తుంది.

* కివి తిన్నవారిలో శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం తక్కువ.

* కివి పండులో లుయిటిన్ పదార్ధం (పండు తొక్కలో) ఉంటుంది. ఇది కంటి చూపును కాపాడుతుంది.

* కివి పండు నుంచి తీసిన రసము చర్మ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.

* పండులోని ‘ఐనోసిటాల్’ పదార్ధం, మనోవ్యాకులత చికిత్సకు సహాయపడుతుంది.

* విరోచనకారిగా, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో తోడ్పడుతుంది కివి పండు.

* గుండెకు రక్తం బాగా సరఫరా కావడానికి, కాలేయ క్యాన్సర్, రక్తనాళాల్లో గట్టి పదార్ధం ఏర్పడకుండా కివి పండు సహకరిస్తుంది.

* క్యాన్సర్ కు దారితీసే జన్యుమార్పులను నిరోధించే పదార్ధం కివి పండులో గుర్తించినట్లు పరిశోధనల్లో తెలిసింది.