Politics

కర్ణాటక స్పీకర్ ఖాదర్ ఏకగ్రీవం…

కర్ణాటక స్పీకర్ ఖాదర్ ఏకగ్రీవం…

కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా యూటీ ఖాదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాదర్ పేరును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బలపరిచారు. స్పీకర్‌ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ఖాదర్ కర్ణాటక శాసనసభకు 23 వ స్పీకర్ కాగా కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన తొలి ముస్లిం ఆయనే కావడం విశేషం. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మంత్రి జి. పరమేశ్వర తదితరులు ఖాదర్‌ను అభినందించారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఖాదర్ ప్రస్తుతం మంగళూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖాదర్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2013-18లో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆరోగ్య, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.

2018-19లో జెడి(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఖాదర్ … హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలను నిర్వహించారు.