Movies

ఎయిర్ పోర్టులో సల్మాన్ ఖాన్‌కు వింత అనుభవం….

ఎయిర్ పోర్టులో సల్మాన్ ఖాన్‌కు వింత అనుభవం….

హీరోలంటే అభిమానులకు ఎనలేని ప్రేమ ఉంటుంది. వాళ్లను తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూస్తారు. ఈ అభిమానులు వయసుతో సంబంధం లేకుండా ఉంటారు. చిన్న పిల్లాడి నుంచి పెద్ద వయసు వరకు ఈ ఫ్యాన్స్ ఉంటారు. తమ హీరోలను లైవ్ లో చూసేందుకు తెగ ఇష్టపడుతుంటారు. ఇక వారు అనుకున్నది జరిగితే హీరోలను కలుసుకునేందుకు ఎలాంటి సాహసం చేయడానికైనా వెనుకాడరు. అలా తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కోసం ఓ లిటిల్ ఫ్యాన్ చేసిన ధైర్యం, అతన్ని ఆదరించిన సల్లు భాయ్ మంచితనం ప్రస్తుతం నెట్టింట్లో ఆకట్టుకుంటుంది.

సల్మాన్ ఖాన్-పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా అంటే మే 26న ప్రముఖ ఓటీటీ జీ5లో విడుదలైంది. మరి చూడాలి ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో. ప్రస్తుతం టైగర్ 3 మూవీ చేస్తున్న సల్మాన్ ఖాన్ కు చిన్న పిల్లలంటే ఇష్టమని తెలిసిందే.

ఇటీవల తనకు పిల్లలు అంటే ఇష్టమని, కానీ పెళ్లి కాకుండా పిల్లలను కనేందుకు చట్టాలు ఒప్పుకోవని తన మనసులో మాట చెప్పాడు సల్లు భాయ్. అయితే ఆయనకు కిడ్స్ అంటే ఎంత ఇష్టమో తాజాగా ఓ వీడియో నిరూపించింది. అబుదాబిలో ఐఫా 2023 (IIFA 2023) వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొననున్నాడు.

ఐఫా వేడుకల కోసం అబుదాబి వెళ్లేందుకని ముంబై ఎయిర్ పోర్టుకు తన సెక్యూరిటీతో బయలుదేరాడు సల్మాన్ ఖాన్. తన సెక్యూరిటీతో ఎయిర్ పోర్టుతో క్యాజువల్ గా నడుస్తూ వెళ్తున్నాడు. ఇంతలో సల్మాన్ చూపు ఒక పిల్లాడిపై పడింది. అటు నుంచి వస్తున్న పిల్లాడికి దారి ఇస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ ఆ లిటిల్ ఫ్యాన్ మాత్రం సల్మాన్ ను హగ్ చేసుకున్నాడు

తనను ఆ పిల్లాడు హగ్ చేసుకోవడంతో దగ్గరికి తీసుకున్నాడు సల్మాన్ ఖాన్. అందమైన చిరునవ్వుతో ఆ పిల్లాడి జుట్టు నిమిరుతూ, అప్యాయంగా కౌగిలించుకున్నాడు. దీంతో ఆ లిటిల్ ఫ్యాన్ మొహం సంతోషంగా వెలిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను చాలా ఆకట్టుకుంటుంది. ఆ చిన్న అభిమాని పట్ల సల్మాన్ చూపించిన ఔదార్యాన్ని పొగుడుతూనే తన ఫేవరేట్ హీరో కోసం సెక్యూరిటీ దాటి వచ్చిన ధైర్యానికి ఫిదా అవుతున్నారు.