NRI-NRT

మత్తు పదార్థాలకు బానిసైన కిమ్….

మత్తు పదార్థాలకు  బానిసైన కిమ్….

కిమ్‌ నిద్రలేమి సమస్యకు చికిత్స కోసం లోతైన వైద్యసమాచారం సేకరించే పనిలో పడ్డట్లు ఎన్ఐఎస్‌ గుర్తించింది. ఈ మేరకు ఎన్‌ఐసీ బ్రీఫింగ్స్‌ను ద.కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్‌ కమిటీ సభ్యుడు యూసాంగ్‌ బూమ్‌ మీడియాతో పంచుకొన్నారు. ఇటీవల ఉత్తరకొరియా భారీ ఎత్తున విదేశీ సిగరెట్లను, ఆల్కహాల్‌తో పాటు తీసుకునే చిరుతిళ్లను దిగుమతి చేసుకొన్నట్లు వెల్లడించారు. దీనికి కిమ్‌ ఇటీవలి చిత్రాలను కృత్రిమ మేధతో విశ్లేషించగా.. అతడు బరువుపెరిగినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం 140 కిలోల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు.

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మద్యానికి, సిగరెట్లకు బానిసగా మారిపోయినట్లు అమెరికాకు చెందిన ఓ పత్రిక కథనంలో పేర్కొంది. దీంతో అతడిలో నిద్రలేమి సమస్యలు తలెత్తినట్లు తెలిపింది. ఫలితంగా అతడి కంటి కింద తీవ్రమైన నల్లటి వలయాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. అతడు జోల్పిడియం వంటి ఔషధాలను కూడా వాడుతున్నట్లు తెలిపింది.