NRI-NRT

ఎయిరిండియా విమానం అత్యవసర రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్….

ఎయిరిండియా విమానం అత్యవసర రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్….

ఎయిరిండియా విమానం రష్యాలో ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరిన విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా రష్యా కు మళ్లించారు. అక్కడ సురరక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రష్యాలోని మగడాన్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన విషయాన్ని ఎయిరిండియా అధికారులు తెలిపారు.ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది ఎయిర్ ఇండియా సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా వారిని గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.