Food

అంజీర పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు …..

అంజీర పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు …..

అంజీర పండులో మనకి కావాల్సిన పోషక విలువలు అన్ని ఉంటాయి. అంజీర పండులో విటమిన్ ఎ , విటమిన్ కె , విటమిన్ B6 మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంజీర పండులో కాల్షియమ్ మరియు పోటాషియం అధిక పాల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగ్నీషియం, పాస్పరస్ మరియు సోడియం ఇతర కనిజ లవణాలు కూడా ఉన్నాయి.

  • అంజీర పండు ని తినడం వల్ల మన జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.అంజీర లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది.
  • అంజీర లో కాల్షియమ్, ఫాస్పరస్ మరియు మెగ్నీషియం కనిజాలు ఉంటాయి. ఇవి మన కండరాల మరియు ఎముకలు బలంగా తయారు అవ్వడానికి దోహదపడతాయి.
  • అదిక బరువుతో బాధపడేవారు అంజిర ని తింటే మీ శరీరములో ఉన్న కొలెస్టిరాల్ స్థాయిని తగ్గిస్తుంది మరియు దీంట్లో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు.
  • మానసిక ఒత్తిడి తో బాధపడేవారు ఈ అంజీర ని తింటే చక్కటి ఫలితం ఉంటుంది.
  • అంజీర ని తినడం వల్ల శరీరం లో చెడు కొలెస్టిరాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె ని పదిలంగా ఉంచుతుంది.
  • అతి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా అంజీర మనల్ని కాపాడుతుంది.
  • లైంగిక సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు రోజు ఉదయం పూట రెండు అంజీరాలని తీసుకుంటే మీ లైంగిక సమస్యలు తగ్గుతాయి.
  • బ్లీడింగ్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నవారు రోజు అంజీరని తినడం వల్ల బ్లీడింగ్ డిజార్డర్ సమస్య తగ్గుతుంది.
  • అంజీరని మెత్తగా పేస్ట్ లా చేసుకుని మొహానికి రాసుకుంటే మొహం పై ఉన్న మెలనిన్ తగ్గుతుంది.
  • డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నవారు అంజీరని తింటే రక్తం లో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.