Politics

కేరళలో ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్….

కేరళలో ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్….

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్ ను ప్రకటించింది. డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయిం తీసుకుంది. దీనిలో భాగంగా తొలి విడతలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్ వర్క్ ను ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతలో 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు, 20 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా హైస్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వనున్నారు.