Politics

పొత్తులపై చంద్రబాబు కీలక ప్రకటన

పొత్తులపై చంద్రబాబు కీలక ప్రకటన

తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది కమిటీ నిర్ణయిస్తుంది. తెలంగాణలో బీజేపీ నేతలతో చర్చలకు పొత్తులపై సమయం మించి పోయిందన్నారు. పొత్తులపై చర్చలకు సమయం మించి పోయిందన్నారు చంద్రబాబు నాయుడు. 119 స్థానాల్లో పోటీ లేక కొన్ని స్థానాల్లోనే పోటీ చేయాలో అనే విషయానికి సంబంధించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై కాస్త ఆలోచిస్తామని వెల్లడించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీలో బీజేపీ, జనసేనతో పొత్తులు పెట్టుకోవాలా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ నకిలీ ఓట్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఏ విషయాన్ని తెలుసుకోకుండా సీఎం జగన్, వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని జ్యోష్యం చెప్పారు.