Politics

దేవినేని ఉమ హౌస్ అరెస్ట్

దేవినేని ఉమ హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి, టిడిపి నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఇవాళ తెల్లవారుజామునే గొల్లపూడిలోని మాజీ మంత్రి ఇంటివద్దకు చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో టిడిపి శ్రేణులు, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగి గొల్లపూడిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల హౌస్ అరెస్ట్ తో మాజీ మంత్రి తన ఇంటివద్దే నిరసనకు దిగారు.అధికార వైసిపి ఇసుక దోపీడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ గత రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం కూడా నిరసనలు కొనసాగించేందుకు టిడిపి నాయకులు సిద్దమయ్యారు. ఇలా ఇవాళ ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టిడిపి పిలుపునిచ్చింది. వైసిపి నాయకుల ఇసుకదోపిడీకి సంబంధించిన ఆధారాలను డిఎంజి డైరెక్టర్ కు అందజేయాలని టిడిపి నాయకులు భావించారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో దేవినేని ఉమ ఇంటివద్దే నిరసన చేపట్టారు.