అట్లాంటాలో మూడు రోజుల పాటు నిర్వహించిన అమెరికా ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) 15వసంతాల సంబరాలు ముగిశాయి. ఈ వేడుకల్లో వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానంతో చివరి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. గుమ్మడి గోపాలకృష్ణ తదితరులతో కూడిన 8 మంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఛలోక్తులు విసురుతూ ఇచ్చిన సమాధానాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తన సంగీత విభావరితో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. ఆప్త్ కార్యవర్గం దాతలను సత్కరించింది. ఆప్త పురస్కారాలు అందజేశారు.