Business

మీ దగ్గర చిరిగిపోయిన లేదా పాడైపోయిన నోట్లు ఉన్నాయా?

మీ దగ్గర చిరిగిపోయిన లేదా పాడైపోయిన నోట్లు ఉన్నాయా?

సాధారణంగా మనం అప్పుడప్పుడు చిరిగిపోయిన లేదా పాడైపోయిన కరెన్సీ నోట్లను చూస్తూ ఉంటాము. ఇలాంటి వాటిని ఎక్కడా తీసుకోవడానికి అంగీకరించరు, కానీ కొంతమంది కొంత కమీషన్‌తో తీసుకోవడానికి ఒప్పుకుంటారు. కానీ ఎలాంటి కమీషన్ ఇవ్వకుండా బ్యాంకుల ద్వారా సులభంగా మార్చుకోవచ్చనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారమ్‌ ఫిల్ చేయకుండానే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి 20 చిరిగిన నోట్లను మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రూ. 5000 మించి ఉండకూడదు.

ఒక పరిమితిలో (తక్కువ డ్యామేజ్) పాడైన నోట్లకు ఆ విలువకు సమానమైన డబ్బు లభిస్తుంది. డ్యామేజ్ ఎక్కువగా జరిగిన నోట్లకు పర్సంటేజ్ ఆధారంగా తిరిగి చెల్లిస్తుంది. ఒకవేళా మీ దగ్గర చిరిగిన నోట్లు ఎక్కువగా ఉంటే బ్యాంకు వెంటనే మార్పిడి చేయదు, మొదట ఆ నోట్లను స్వీకరించి.. తరువాత మీ ఖాతాలో జమ చేస్తుంది.

ఇవి తప్పనిసరి..చిరిగిన కరెన్సీ నోట్ల మీద సీరియల్ నెంబర్, మహాత్మా గాంధీ మార్క్, గవర్నర్ సంతకం వంటి గుర్తులు ఉంటే వాటిని బ్యాంకులు మార్చడానికి అంగీకరిస్తాయి. ఎక్కడైతే మీ దగ్గరున్న చిరిగిన నోట్లను మార్చాలనుకుంటారో అక్కడ ఖచ్చితంగా అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు.ఎక్కువగా చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకోవాలంటే దానికి సమానమైన మొత్తం లభించకపోవచ్చు. ఉదాహరణకు సుమారు 78 చదరపు సెం.మీ బాగున్న రూ. 500 నోటుకు దానికి సమానమైన డబ్బు ఇస్తారు. ఒకవేళా 39 చదరపు సెం.మీ పాడైపోయి ఉంటే దానికి కేవలం సగం డబ్బు లభిస్తుంది. ఇదే నియమం ఇతర నోట్లకు కూడా వర్తిస్తుంది. అయితే ఉద్దేశ్యపూర్వకంగా కట్ చేసిన నోట్లను బ్యాంక్ తీసుకునే అవకాశం ఉండదు. దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.