DailyDose

దెయ్యాన్ని వదిలిస్తానని నవ వధువుపై అత్యాచారం-TNI నేటి నేర వార్తలు

దెయ్యాన్ని వదిలిస్తానని నవ వధువుపై అత్యాచారం-TNI నేటి నేర వార్తలు

పాలల్లో విషం కలిపి నెలల బిడ్డను చంపేసిన రాక్షసి

తన భర్త మొదటి భార్యకు పుట్టిన ఐదు నెలల పాపకు తాగించే పాలలో విషం కలిపి హత్య చేసిన ఆరోపణలపై దేవమ్మ అనే గృహిణిని కర్ణాటకలోని యాదగిరి గ్రామీణ ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దారుణ ఘటనకు కారణం ఏంటని ఆరా తీయగా షాకింగ్‌ వాస్తవాలు బయటపడ్డాయి. వివరాల్లోకెళితే.. బబలా గ్రామానికి చెందిన సిద్ధప్ప బెట్టిగేరికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య శ్రీదేవికి సంతానం కలగకపోవడంతో ఏడేళ్ల కిందటే దేవమ్మను సిద్ధప్ప వివాహం చేసుకున్నాడు. శ్రీదేవి దగ్గర ఉండి తన భర్తకు వివాహం చేయించింది. దేవమ్మకు నలుగురు బిడ్డలు పుట్టారు. మరోవైపు ఐదు నెలల కిందట శ్రీదేవి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు సంగీతా బెట్టిగేరి అని ఇటీవలే పేరు పెట్టారు. ఆగస్టు 30న తన చిన్నారి ఏడుస్తుండడంతో పాలు పట్టించాలని దేవమ్మకు చెప్పి , శ్రీదేవి ఇంటి పని చేసుకునేందుకు వెళ్లింది. ఆ బిడ్డకు ఆస్తిలో వాటా వెళుతుందన్న అక్కసుతో దేవమ్మ పాలలో విషం కలిపి తాగించింది. పాలు తాగిన మూడు గంటల్లోనే ఆ బిడ్డ చని పోయింది. సాధారణ మృతి అని భావించినా వైద్య పరీక్షల్లో విష ప్రయోగంతోనే బిడ్డ మరణించిందని వైద్యులు ప్రకటించారు. శ్రీదేవి ఫిర్యాదుతో దేవమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమె తన నేరాన్ని అంగీకరించింది.

దెయ్యాన్ని వదిలిస్తానని నవ వధువుపై అత్యాచారం

శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొంతమంది నేడు దయ్యాలు భూతాలు అంటూ మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడుతున్నారు. తాజా దయ్యం పట్టుకుందని నమ్మించి ఓ నవ వధువు పై ఓ కీచక బాబా దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ ఆలం ప్రాంతానికి చెందిన ఓ యువతకి మూడు నెలల క్రితం వివాహమైంది.అయితే వివాహానంతరం ఆ యువతి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను పలు ఆసుపత్రుల వెంబడి తిప్పారు కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె అత్త మామ బండ్లగూడలోని మజార్ ఖాన్ అనే ఓ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ యువతిని చూసిన ఆ బాబా ఆమెకు దయ్యం పట్టిందని వారిని నమ్మించాడు. ఆమెకు పట్టిన దయ్యాన్ని తాను వదిలేస్తానని అత్తమామలకి చెప్పాడు. తమ కోడల్ని మీరే కాపాడాలంటూ బాబుతో చెప్పారు. దీంతో వారిని బయటే ఉండమని ఆ వివాహితను గదిలోకి తీసుకెళ్లాడు. అందరం ఆమె కనులకు గంతలు కట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా అంటూ బెదిరించాడు.కానీ ఆ మహిళ ఆ దారుణాన్ని తన అత్త మామలకు చెప్పింది. కానీ వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అవివాహిత తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితున్ని ఎట్టకేలకు పట్టుకొని అరెస్ట్ చేశారు.

రైతులను నిండా ముంచిన ముఠా అరెస్ట్

రైతులను నిండా ముంచుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీళ్లలో డెటాల్ కలిపి పంటకు నష్టం కలిగించే పురుగులను చంపుతుందని చెప్పి ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ గోదాంను ఏర్పాటు చేసుకుని నకిలీ పిచికారీ మందులను తయారు చేసి వాటికి బ్రాండెడ్ కంపెనీల స్టికర్లను వేసి అమాయక రైతులకు విక్రయిస్తున్నారని పోలీస్ విచారణలో బయటపడింది.ఈ ముఠా తయారు చేసిన నకిలీ మందులను తెలంగాణ వ్యాప్తంగా ఫర్టిలైజర్ దుకాణాలకు విక్రయించినట్లు తెలిసింది. ఈ నకిలీ పిచికారీ మందులను కొనుగోలు చేసిన పత్తి, కంది పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుస్తోంది. ఈ ముఠా ఫర్టిలైజర్ దుకాణదారులకు భారీ కమీషన్‌లను ఆశ చూపి జోరుగా నకిలీ మందులను విక్రయించినట్లు పోలీసులు తేల్చారు. ఈ ముఠా నుంచి 20 వేల లీటర్‌ల నకిలీ పిచికారీ మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అర్థరాత్రి ప్రేమికుడి ఇంటి కెళ్లిన ప్రియురాలు

 ఆ ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవలనుకున్నారు. ఐతే ప్రియురాలు ఉన్నత చదువులు చదువుతోంది. చదువు పూర్తైన తర్వాత చిన్న షాపులో వెల్డర్‌గా పనిచేసే నిన్ను పెళ్లి చేసుకోలేనని, తనను మర్చిపోవాలని చెప్పింది. అంతేకాకుండా ప్రియుడి ఫోన్‌లోని తన ఫొటోలు, తాను పంపిన మెసేజ్‌లు అన్నింటిని తొలగించాలని కోరింది. అందుకు అతను అంగీకరించకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి పరారైంది. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా పెనమలూరులో శనివారం (సెప్టెంబర్ 2) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎన్టీఆర్‌ జిల్లా కానూరు సనత్‌నగర్‌కు చెందిన లంకే నాగరాజు అనే వ్యక్తి ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్‌ వర్క్‌షాపులో వెల్డర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలనీలో లా చదువుతోన్న ఓ విద్యార్థినితో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారిపోయింది. ఇలా దాదాపు ఐదేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిపారు. ఐతే ఇటీవల సదరు యువతి మనసు మార్చుకుంది. బాగా చదువుకొన్న, పెద్ద ఉద్యోగం చేసే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని, తనను మర్చిపోవాలని నాగరాజును కోరింది. అతని ఫోన్లో ఉన్న తన ఫొటోలు, మెసేజ్‌లు కూడా పూర్తిగా తీసేయాల్సిందిగా కోరింది. దీంతో నాగరాజు సడెన్‌గా ఎందుకీ నిర్ణయం తీసుకున్నావంటూ యువతిని నిలదీశాడు. ఆమె సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడంతో నాగరాజు తన ఫోన్‌లో ఫొటోలు తీసేయడం కుదరదని తెగేసి చెప్పాడు.ఈ క్రమంలో శనివారం (సెప్టెంబర్ 2) అర్ధరాత్రి తల్లితో కలిసి సదరు యువతి నాగరాజు ఇంటికి వెళ్లింది. గాఢనిద్రలో ఉన్న అతన్ని లేపి తన కుమార్తె తనను ప్రేమించడంలేదని, స్నేహితురాలిగానే వ్యవహరిస్తోంది అంటూ యువతి తల్లి అడిగింది. ఫోన్‌లో ఫొటోలు, మెసేజ్‌లు తీసేయకుండా ఎందుకు ఏడిపిస్తున్నావంటూ నిలదీసింది. అనతంరం నాగరాజు ఫోన్‌ లాక్కుని అతన్ని కత్తితో పొడిచింది. దీంతో భయాందోళనలకు గురైన నాగరాజు బాధతో పెద్దగా కేకలు వేశాడు. ఇరుగు పొరుగు వారు నాగరాజు అరుపులు విని అతని ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న నాగరాజును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. పెనమలూరు పోలీసులకు ప్రియురాలు, ఆమె తల్లిపై నాగరాజు ఫిర్యాదు చేయడంతో సోమవారం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న తల్లీకూతుళ్ల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

నైట్ పెట్రోలింగ్‌‌పై ఫోకస్

రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్ అర్ధరాత్రి 2 గంటల వరకు ఉప్పల్, మేడిపల్లి, మీర్ పేట్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, గస్తీ పోలీసు అధికారుల విధుల నిర్వహణను పరిశీలించారు. అర్ధరాత్రి డ్యూటీలు చేసి వచ్చే వారికి భద్రతపై భరోసా కలిగించాలన్నారు. అర్ధరాత్రి సమయాల్లో పోలీసు సహాయం కోరుతూ వచ్చే ఫోన్‌లకు వెంటనే స్పందించి ప్రజలకు సత్వరమే సేవలను అందించాలని సీపీ ఆదేశించారు. విధుల్లో ఉన్న అధికారుల తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

* వాకింగ్ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఆటో ఎక్కిన మహిళ

ఆ మహిళ వాకింగ్ వెళ్లింది. వాకింగ్ పూర్తి చేసే సరికి ఆలస్యమైందని ఆటో ఎక్కింది. అప్పటికే రాత్రి 9.45 అవుతోంది. కొంత దూరం వెళ్లిన తరువాత ఆ ఆటోలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కూర్చుకున్నారు. నేరుగా ఆ ఆటోను కాలువ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లారు. ఆ మహిళను బయటకు లాగి, అక్కడే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హర్యానాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫరీదాబాద్ సిటీలోని ఓ కాలనీకి చెందిన మహిళ ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో టౌన్ పార్కులో వాకింగ్ కు వెళ్లింది. అనంతరం రాత్రి 9.45 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. తాను ఎక్కడికి వెళ్లాలనే వివరాలు ఆటో డ్రైవర్ కు చెప్పింది. ఆమె ఆటో ఎక్కిన సమయంలో అందులో ఇతర ప్రయాణికులెవరూ లేరు.సుమారు 100 మీటర్లు వెళ్లిన తరువాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి కూర్చున్నారు. కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆటో కాలువ క్రాసింగ్ ప్రాంతంవైపు మళ్లింది. ఆ కాలువ దగ్గర ఉన్న పొదల సమీపంలోకి వెళ్లిన తరువాత ఆగింది. అందులో నుంచి మహిళను బటయకు తీసుకొచ్చి, పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వారితో ప్రతిఘటించి, ఎలాగోలా ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. అక్కడ ఎవరో ఒకరి సెల్ ఫోన్ అడిగి పోలీసులకు, కుటుంబ సభ్యులకు ఈ ఘటనపై సమాచారం అందించింది. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.సీసీటీవీ ఫుటేజీ, రహస్య వర్గాల సమాచారం ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మూడో నిందితుడి కోసం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. అరెస్టయిన నిందితులను విష్ణు, సనోజ్ గా పోలీసులు గుర్తించారు. ఇందులో విష్ణు స్వస్థలం ఆగ్రా.. కానీ ప్రస్తుతం ఫరీదాబాద్ లోని సంజయ్ ఎన్ క్లేవ్ లో నివసిస్తున్నాడు. మరో నిందితుడు సనోజ్ పార్వతీయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 

*  ఓ యువతిపై ప్రేమోన్మాది బ్లెడ్‌తో దాడి

 ఆ యువతి శ్రీహరిపురంలో ఓ యువతిపై ప్రేమోన్మాది బ్లేడ్‌తో దాడి చేశాడు. నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న లతశ్రీ ఇంట్లోకి సోమవారం అర్ధరాత్రి చొరబడిన అదే చోటు చేసుకున్న నేతేటి రామారావు బ్లేడ్‌తో యువతి గొంతుకోశాడు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో జులాయిగా తిరుగుతున్న ఇద్దరి మధ్య తగాదాలు. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో లతశ్రీ ఇంటికి వెళ్లిన రామారావు.. ఆమె గొంతు కోసి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

 సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌

 ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు. సుక్మా (Sukma) జిల్లాలోని తండమెట్ల, దులేడ్‌ అటవీ ప్రాంతంలో జాగర్‌గుండా ఏరియా కమిటీకి చెందిన 10 నుంచి 12 మందితో కూడిన బృందం తిరుగుతున్నదని భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని జిల్లా పోలీసులు తెలిపారు.మిగిలిన వారు పరారయ్యారని, వారికోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు. ఘటనా స్థలంలో 12 బోర్‌ డబుల్‌ బ్యారెల్‌ రైఫిల్‌, పిస్తోల్‌, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మృతిచెందినవారిని మిలీషియా క్యాడర్‌కు చెందిన సోథి దేవ, రావ దేవగా గుర్తించామన్నారు. వారిద్దరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని తెలిపారు.

ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా? 

హైదరాబాద్ ప్రజలకు, పర్యాటకులకు బిర్యానీతో పాటు ఉస్మానియా బిస్కెట్ కూడా ఎంతో సుపరిచితం. ఎంతో రుచిగా ఉంటున్నాయని ఉస్మానియా బిస్కెట్లను ఇష్టంగా తినేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అసలు విషయం తెలిస్తే ఇకపై అలా చేయలేరు. ఎందుకంటే ఉస్మానియా బిస్కెట్ తయారీలో ప్రామాణికత, శుభ్రత పాటించడం లేదంటూ అధికారులు రంగంలోకి దిగారు. అంతేకాక దాదాపు రూ. 36 వేల విలువైన ఉస్మానియా బిస్కెట్ స్టాక్‌ని సీజ్ కూడా చేశారు. అసలేం జరిగిందంటే.. ఉస్మానియా బిస్కెట్ ఎంతో రుచిగా ఉంటుందని వినయ్ వంగాల అనే యువకుడు శనివారం మియాపూర్‌లో ఓ ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే తాను తింటున్న ఓ బిస్కెట్‌లో ఈగ ఉందని గమనించాడు వినయ్. అంతే.. వెంటనే స్థానిక ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు తన ట్విట్టర్ ఖాతా నుంచి ఫిర్యాదు చేశాడు.వినయ్ ట్వీట్‌పై స్పందించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ అధికారులు మియాపూర్‌లోని సదరు దుకాణంపై ఆదివారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా శాంపిల్స్ తీసుకున్న అధికారులు వెంటనే 36 వేల రూపాయల విలువైన ఉస్మానియా బిస్కెట్ల స్టాక్‌ని సీజ్ చేశారు. ఈ మేరకు వినయ్ ట్వీట్‌కి రిప్లై‌ ఇచ్చారు.కాగా, ఉస్మానియా బిస్కెట్‌ స్టాక్‌ని అధికారులు సీజ్ చేసిన నేపథ్యంలో సీటీ పరిధిలోని పలువురు నెటిజన్లు.. హైదరాబాద్ వ్యాప్తంగా ఇలాంటి షాపులెన్నో ఉన్నాయని, వాటిపై కూడా తనిఖీలు అవసరమని అధికారులను కోరుతున్నారు. ఇంకా అధికారులు చేసిన ట్వీట్ ఫోటో ద్వారానే ఉస్మానియా బిస్కెట్ తయారీలో పరిశుభ్రత ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోందని, వారి చేతులకు కనీసం గ్లౌజ్‌లు కూడా లేవని, అధికారుల స్పందన అభినందనీయం అంటూ పలువరు కామెంట్ చేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మరీ చితకబాదిన వైనం

 వీధిలో రోడ్డు నిర్మించడం లేదని చౌరస్తాలో తనను దూషించాడన్న సమాచారంతో మండలంలోని ఓ గ్రామ సర్పంచ్‌ సదరు వ్యక్తిని పంచాయతీ తాత్కాలిక సిబ్బందితో మోటార్‌ సైకిల్‌పై ఇంటికి రప్పించుకుని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల బాగోగులు చూడాల్సిన సర్పంచే ఏకంగా ఓ వ్యక్తిని ఇంటికి పిలిపించుకుని కొట్టడంపై గ్రామస్తులు విస్తుపోతున్నారు. ఈ ఘటనపై మండలస్థాయి అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ తెలియనట్లు నటిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత శుక్రవారం సాయంత్రం తమ వాడలో సర్పంచ్‌ రోడ్డు నిర్మించడం లేదని గ్రామ చౌరస్తాలో దూషించినట్లు సమాచారం. విషయాన్ని స్థానికుడొకరు సర్పంచ్‌ దృష్టికి ఫోన్‌లో చేరవేశారు. నిజాలు తెలుసుకోకుండానే కోపోద్రిక్తుడైన సదరు సర్పంచ్‌.. వెంటనే పంచాయతీ తాత్కాలిక ఉద్యోగికి ఫోన్‌ చేసి సదరు వ్యక్తిని తీసుకరావాలని హుకూం జారీ చేశాడు. సదరు ఉద్యోగి ఆ వ్యక్తిని సర్పంచు ఇంటికి తీసుకొని వెళ్లడమే ఆలస్యం.. ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ముందున్న చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు.అంతటితో ఆగకుండా సదరు వ్యక్తి కుమారుడికి ఫోన్‌ చేసి ‘మీ తండ్రిని చెట్టు కట్టేశాం..’ అని చెప్పారు. ఆందోళనకు గురైన బాధితుడి కుమారుడు తన మేనమామను వెంట తీసుకుని వెళ్లి చెట్టుకు కట్టేసి ఉన్న తండ్రిని చూసి చలించిపోయాడు. విడిచిపెట్టాలని సర్పంచ్‌ను కోరగా ఇష్టమొచ్చినట్లు తిడితే తాము పడతామా అని సర్పంచు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సర్పంచు కాళ్లు మొక్కి.. ఇకమీదట తిట్టకుండా చూస్తామని చెప్పి తండ్రిని ఇంటికి తీసుకొచ్చారు.చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన నుంచి తేరుకోని బాధిత కుటుంబానికి శనివారం గ్రామ పంచాయతీ నుంచి పిలుపు వచ్చింది. ఓ పెద్దమనిషి ఫోన్‌ చేసి పంచాయతీ కార్యాలయం వద్దకు రావాలని ఆదేశించగా.. మళ్లీ ఏం జరుగుతుందోనన్న భయాందోళనతో వెళ్లిన యువకుడికి మళ్లీ క్లాస్‌ పీకారు. ఇలాంటి ఘటన పునరావృతం అయితే పోలీస్‌స్టేషన్‌లో వేయిస్తానని సర్పంచు బెదిరించినట్లు సమాచారం. అక్కడే ఉన్న మిగతావారు కూడా సర్పంచును దూషించొద్దని సూచించి పంపించినట్లు సమాచారం. ఈ విషయమై బాధితుడి కుమారుడిని వివరణ కోరగా.. తనతండ్రిని చెట్టుకు కట్టేసి కొట్టారని, విడిపించాలని కోరితే సర్పంచుతోపాటు ఆయన కుటుంబసభ్యులు హెచ్చరించి వదిలేశారని చెప్పాడు.