DailyDose

వివాహితపై పోలీసుల సామూహిక అత్యాచారం-TNI నేటి నేర వార్తలు

వివాహితపై పోలీసుల సామూహిక అత్యాచారం-TNI నేటి నేర వార్తలు

*  వివాహితపై పోలీసుల సామూహిక అత్యాచారం

హర్యానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ భర్త మీద ఫిర్యాదు చేయడానికి పోలీసులను ఆశ్రయిస్తే.. వారే ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తరువాత వేరే వ్యక్తికి అమ్మేశారు. ఈ షాకింగ్ ఘటన పాల్వాల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెడితే,ఓ మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు పాల్వాల్‌లోని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. వివాహితపై అక్కడి సబ్-ఇన్‌స్పెక్టర్ సహచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అధికారులు సోమవారం తెలిపారు.నిందితులు ఆమెను ఓ ఇంట్లో మూడు రోజుల పాటు బందీగా ఉంచి పలుమార్లు అత్యాచారం చేశారు. తరువాత, వారు ఆ మహిళను మరొక వ్యక్తికి విక్రయించారని, అతను కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వారు తెలిపారు.ఆదివారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.నిందితులలో ఒకరి ఫోన్‌ నుంచి ఎలాగో మహిళ పోలీసులకు సమాచారం అందించగా, రక్షించినట్లు వారు తెలిపారు.పోలీసులు మహిళను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ జూలై 23న హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది, అక్కడ నిందితుడు సబ్-ఇన్‌స్పెక్టర్ శివ చరణ్‌ను కలిసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించడానికి అతను నిరాకరించాడు. అంతేకాదు.. తన అనుచరుడు బల్లితో కలిసి సమీపంలోని పొలానికి వెళ్లాలని శివ చరణ్ ఆమెను బలవంతం చేశాడు. అక్కడ నిరంజన్, భీముడు ఉన్నారు. ఆమె అక్కడికివెళ్లిన తరువాత ముగ్గురూ ఆమెపై అత్యాచారం చేయడంతోపాటు అసభ్యకర వీడియోలు కూడా చిత్రీకరించారు. “వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి, ముగ్గురు ఆమెను పల్వాల్‌లోని శాంతి అనే మహిళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ రాత్రి ఆమెను ఉంచి మళ్లీ అత్యాచారం చేశారు” అని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తరువాత ఆమెను బిజేంద్ర అనే ఒకరికి విక్రయించారు, అతను తన బావ గజేంద్రతో కలిసి సబ్-ఇన్‌స్పెక్టర్ శివ చరణ్ సమక్షంలో ఆమెపై అత్యాచారం చేశాడు అని పోలీసులు తెలిపారు. 

ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

 కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సందీప్‌ కుమార్‌ (32) బుధవారం ఉదయం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐలు శ్రీనివాస్ నాయక్‌, విక్రమ సింహ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను విచారించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఆదోని ప్రాంతీయాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదు

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్ కుమారుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై యూపీ రాంపూర్‌లో కేసు నమోదైంది. ఉదయనిధితో పాటు కాంగ్రెస్ జాతీయఅధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేపై కూడా కేసు నమోదు అయింది. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు, ఆయనకు మద్దతుగా ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యల కారణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై 295A, 153A ఐపీసీ సెక్షన్ల కింద సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.లాయర్లు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, ఉదయనిధి స్టాలిన్ గత శనివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మలేరియా, డెంగ్యూలను నిర్మూలించినట్లే సనాతనధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఉదయనిధి కామెంట్స్‌పై బీజేపీ సీరియస్ కాగా, కాంగ్రెస్ లోని కొంత మంది నేతలు ఇప్పటికే ఖండించారు.

* వధువు కోసం శివయ్యకు పూజలు చేసిన యువకుడు

ఉత్తరప్రదేశ్‌లోని కౌశుంబిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జంట శ్రావణ మాసాలు వచ్చాయి. ఉత్తరాదిలో ఈ శ్రావణ మాసం శివయ్య పూజకు అత్యంత పవిత్రమాసమని భావిస్తారు. తాము కోరిన కోర్కెలు తీర్చమంటూ భోళాశంకరుడికి భక్తి శ్రద్దలతో పూజలను చేస్తారు. తనకు పెళ్లి ఈ శ్రావణ మాసం అయ్యేలోగా జరగాలని కోరుకుంటూ.. శివ భక్తుడైన ఓ యువకుడు శ్రావణ మాసం ప్రారంభం నుంచి అత్యంత భక్తి శ్రద్దలతో శివలింగానికి పూజలు చేశాడు. రోజూ శివయ్యకు అభిషేకం చేస్తూ తనకు పెళ్లి కుదిరేలా అనుగ్రహించమంటూ వేడుకున్నాడు. అయితే ఉత్తరాదిలో శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమితో పూర్తి అయి భాద్రపద మాసం వచ్చింది. అయినప్పటికీ తనకు పెళ్లి కుదరలేదని కోపంతో తాను పూజలను చేసిన శివలింగాన్ని దొంగిలించి పరారయ్యాడు. ఇప్పుడు ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సంఘటన మహేవాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, కుమ్హియావాన్ మార్కెట్‌కి చెందిన 27 ఏళ్ల ఛోటూ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతను దేవునికి తన కోరిక విన్నవించి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే శివుడికి జలాభిషేకం చేశాడు. శ్రావణ మాసం అయిపోయింది.. అయినా చోటుకు పెళ్లి కుదరలేదు. వధువు దొరకలేదు. దీంతో శివుడిపై కోపం వచ్చి ఆలయంలోని లింగాన్ని దొంగిలించాడు. ఆలయం వెలుపల శివలింగాన్ని ఉంచి వెదురు, ఆకులతో కప్పి దాచాడు. మర్నాడు ఉదయం కొందరు భక్తులు ఆలయానికి చేరుకోగా.. శివలింగం కనిపించకుండా పోవడంతో షాక్ తిన్నారు. పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. శివలింగాన్ని దొంగిలించింది ఛోటూ అని తెలుసుకున్నారు.పోలీసులు ఛోటూను విచారించారు. శివలింగాన్ని దొంగిలించి గుడి బయట దాచినట్లు అంగీకరించాడు. అంతేకాదు చోటు చెప్పిన రీజన్ విన్న పోలీసులు షాక్ తిన్నారు. చోటు దాచిన ప్లేస్ కు వెళ్లిన పోలీసులు శివలింగాన్ని స్వాధీనం చేసుకుని.. తిరిగి గుడిలో ప్రతిష్టించారు. నిందితుడిపై పోలీసులు సెక్షన్ 379, 411 కింద కేసు నమోదు చేశారు.

నల్లగొండ జిల్లాలో ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి మరణించారు. ఈ సంఘటన నిన్న జరుగగా.. ఇవాళ వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిన్న నల్లగొండ పట్టణంలోని రామ్ నగర్ పార్క్ లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినిలు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు.అయితే.. ఇవాళ చికిత్స పొందుతూ మనీషా, శివాని కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. అధిక మోతాదులో వెంట తెచ్చుకున్న గడ్డి మందు తాగిన విద్యార్థినిలు… ఇవాళమరణించారు.ఆత్మహత్యకు సిద్ధపడి గడ్డి మందు తెచ్చుకున్న విద్యార్థినిలు… నిన్న తాగారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

*   ఒంగోలు కృష్ణానగర్‌లో దారుణం

ఒంగోలు కృష్ణానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. బ్యుటీషియన్‌పై యాసిడ్ దాడి చేసి నగదు, నగలు అపహరించారు. మేకప్ చేయాలని ముగ్గురు మహిళలు పార్లర్‌కు వచ్చారు. నిందితులు ముఖంపై యాసిడ్ చల్లి మత్తు మందు ఇచ్చారు. మహిళ ప్రతిఘటించడంతో నోట్లో యాసిడ్ వేసేందుకు మహిళలు యత్నించారు. అనంతరం నగదు, నగలతో ముగ్గురు మహిళలు ఉడాయించారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీ టీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మూసీ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహం

 మూసీ నదిలో మహిళ మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మూసీ పరివాహక ప్రాంతంలో బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి  పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను కవాడిగూడ డిఎస్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ భార్య లక్ష్మి(55)గా గుర్తించారు.లక్ష్మి ఆచూకీ తెలియటం లేదని గత ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఇవాళ ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో మూసీ ఒడ్డున లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం లక్ష్మి మృతదేహన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 ఆగి ఉన్న లారీని ఢీ కొన్న వ్యాన్‌

అతి వేగం కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా జరిగినా నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతుంది. ఇక రాత్రి పూట అయితే మరీ అప్రమత్తంగా ఉండాలి.ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిద్ర మత్తులోనే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. ఇలా రాత్రి వేళల్లో చాలా యాక్సిండెంట్లు జరగడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తమిళనాడులోకి కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ఒక వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్ ఆగి ఉన్న ఒక లారీని బలంగా ఢీకొట్టింది.  సేల‌మ్‌-ఈరోడ్ మ‌ధ్య ఉన్న హైవేపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ వ్యాన్ లో డ్రైవర్ తో కలిపి 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. చనిపోయిన వారిలో ఏడాది చిన్నారి కూడా ఉంది. ఇక ఆ వ్యాన్ ఎనుగూరు నుంచి పెరుంత‌రై వైపు వెళుతోంది. మృతిచెందిన‌వారిని సెల్వరాజ్, మంజుల‌,  ప‌ళ‌నిస్వామి, అరుముగం,ప‌ప్పాతిగా గుర్తించారు. ఇక అదే వ్యాన్ లో ఉన్న ప్రియా అనే ప్రయాణీకురాలు, డ్రైవర్  విఘ్నేశ్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో చూస్తుంటేనే వ్యాన్ ఎంత స్పీడ్ లో ఉందో ఉందో అర్థం అవుతుంది. కేవలం డ్రైవర్ స్పీడ్ గా నడపడం వల్లే బండి అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసలు కేేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 6 గురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది వ్యాను.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా…మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. సేలం – ఈరోడ్డు హైవేలో వెళుతూండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వద్దకు చేరుకున్న పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు క్షత గాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమం

ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డు రవీందర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఉస్మానియా ఆసుపత్రిలో అతడికి చికిత్స కొనసాగుతోంది. సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో ఓ హోంగార్డు అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన షాయినాయత్‌గంజ్‌ ఠాణా పరిధిలో మంగళవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 55 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో అతడిని ఉస్మానియా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు రవీందర్‌ భార్య సంధ్య మీడియాతో మాట్లాడారు. సకాలంలో జీతం రాక, అధికారుల వేధింపులతోనే తన భర్త ఆత్మహత్యకు యత్నించారని ఆరోపించారు. అతడికి సరైన చికిత్స కూడా అందించలేకపోతున్నామన్నారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరారు. మంచి వైద్యం అందించి తన భర్తను కాపాడాలని సంధ్య విజ్ఞప్తి చేశారు.