Editorials

నేడు తెలంగాణాలో 9 వైద్య కళాశాలలు ప్రారంభం

నేడు తెలంగాణాలో 9 వైద్య కళాశాలలు ప్రారంభం

దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం కొత్త రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించనున్నది. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో జిల్లాకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.