‘వీసా అపాయింట్‌మెంట్ కోసం ఫీజు చెల్లించారా? వీసా ఇంటర్వ్యూ తేదీ(స్లాట్)ని ఇంకా ఖరారు చేసుకోలేదా? తక్షణమే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. లేనిపక్షంలో మరోసారి ఫీజు చెల్లించాల్సి వస్తుంది’ అని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ స్పష్టం చేసింది. గతేడాది అక్టోబరు 1వ తేదీలోపు వీసా ఫీజు చెల్లించిన పక్షంలో ఈ నెలాఖరుతో ఆ ఫీజు గడువు ముగుస్తుందని ప్రకటించింది. వీసా ఇంటర్వ్యూ హాజరు మినహాయింపు సదుపాయమున్న వారికి సైతం ఈ గడువే వర్తిస్తుందని కాన్సులేట్ వెల్లడించింది. అంతలోపు వీసా స్లాటు ఎప్పుడు లభిస్తే అప్పుడు తీసుకోవాలని సూచించింది. సాధారణంగా ఫీజు చెల్లించిన 365 రోజుల్లోగా స్లాట్ బుక్ చేసుకోవాలి. అలా చేయని పక్షంలో ఆ ఫీజు రద్దు అవుతుంది. కరోనా సమయంలో ఫీజు చెల్లుబాటు గడువును అమెరికా ప్రభుత్వం పొడిగించింది. అప్పట్లో పొడిగించిన గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఇక నుంచి ఫీజు చెల్లుబాటు వ్యవధి ఏడాదిగానే పరిగణించనుంది. స్లాట్ బుక్ చేసుకోవాలంటే ముందస్తుగా ఫీజు చెల్లించాలి. స్లాట్లు విడుదలైన తరవాత బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Breaking: హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ కీలక ప్రకటన

Related tags :