Politics

షర్మిల గురించి బాధ వేస్తోంది-NewsRoundup-Apr 30 2024

షర్మిల గురించి బాధ వేస్తోంది-NewsRoundup-Apr 30 2024

* ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా (Coronavirus) వైరస్‌ సీక్వెన్స్‌ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాడు. కొంతకాలంగా ఆ దేశాధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన పనిచేస్తున్న ల్యాబ్‌ నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో చేసేది లేక అదే ల్యాబ్‌ ఎదుట ఆయన నిరసనకు దిగాడు.

* ‘రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే మేనిఫెస్టోను మీ ముందు పెట్టాం. తెదేపా, భాజపా, జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కూటమి మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘పథకాలకు ఎక్కడినుంచి నిధులు వస్తాయని అంటున్నారు. జగన్‌ ఎక్కడి నుంచి తెచ్చారు.. సాక్షి నుంచి తెచ్చారా? భారతి సిమెంట్‌ అమ్మి తెచ్చారా?’’ అని ప్రశ్నించారు.

* ఆయనకు విజయం లభించకపోతే.. ఇతరుల మంచి పనులను కూడా శరద్‌పవార్‌ చెడగొడతారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి ఏమీ చేయలేదని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత (Sharad Pawar)పై ప్రధాని (PM Modi) విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం రాణించిన సూచీలు.. గరిష్ఠాల వద్ద మదుపరులు అమ్మకాలకు దిగడంతో ఆఖర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా చివరి అరగంటలో సూచీలు ఒక్కసారిగా భారీగా కుదుపునకు లోనయ్యాయి. దీంతో ఇంట్రాడేలో 22,783.35 వద్ద సరికొత్త గరిష్ఠాలకు అందుకున్న నిఫ్టీ మళ్లీ 22,600 స్థాయికి చేరింది.

* జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

* బంగారం ధరలు పెరిగినా.. కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరింది. బలమైన ఆర్థిక పరిస్థితులే అందుకు కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) పేర్కొంది. ఆర్‌బీఐ పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా డిమాండ్‌ పుంజుకోవడానికి దోహదం చేసింది.

* మద్యం విధానం కేసులో అరెస్టయి ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న ఆప్‌ (AAP) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal)ను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) కలిశారు. కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఇన్సులిన్‌ తీసుకుంటున్నారని వెల్లడించారు.

* ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో మేం పోరాడుతున్నాం. ఈ రెండు పార్టీల రిమోట్లు చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలను ఆయనే నియంత్రిస్తున్నారు. కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న తన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల గురించి సీఎం జగన్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే కాదు ఆమెకు డిపాజిట్లు కూడా దక్కబోవనే విషయం తనను బాధకు గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. .. ఏపీలో నాకు పోటీగా రాజకీయాలు చేసేలా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు, షర్మిలను ప్రభావితం చేశారు. నాపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, చనిపోయాక నా తండ్రి..దివంగత మహానేత వైఎస్సార్‌ పేరును ఛార్జిషీట్‌లో చేర్చిన పార్టీతో ఆమె చేతులు కలిపారు. ఇదంతా ఎంతో బాధ కలిగిస్తోంది. ఎవరు ఏమిటనేది ఈ ఎన్నికల ద్వారా ప్రజలే నిర్ణయిస్తారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపైనా సీఎం జగన్‌ స్పందించారు. ‘‘ఒకరు తప్పు చేశారా? లేదా? అనేది న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి. జైలుశిక్ష పడిందీ అంటే ఏదో తప్పు చేశారనే అర్థం. చంద్రబాబు తప్పు చేశాడనడానికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

* చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తొస్తాయని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా.. కనీసం పశ్చాతాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని.. పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు.

* తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసు (Patanjali Row)లో సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈసందర్భంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతే పతంజలిపై చర్యలు తీసుకోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.

* ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మ్యానిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు.‘‘ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు మళ్లించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చింది’’ అని పవన్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z