NRI-NRT

మందాడి శ్రీహరి ఆధ్వర్యంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

మందాడి శ్రీహరి ఆధ్వర్యంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి చొరవతో కాటూరు మెడికల్ కాలేజీ సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 500 మందికి పైగా రోగులకు శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గుండె, శ్వాస కోస, ఊపిరితిత్తులు, కళ్ళు, ముక్కు, చెవి, గొంతు, ఎముకలు, కీళ్లకు చెందిన వైద్యులు పరీక్షలు చేశారు.

జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే లక్ష్యంతోనే తాము ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ, స్థానిక ప్రముఖులు మాగలూరి భాను ప్రకాష్, బొల్లు సురేశ్, హరి కొల్లూరు, కిరణ్ కుంచనపల్లి, గ్రామ పెద్దలు శివప్రసాద్, మల్లికార్జునరావు, నరేష్, శ్రీనివాసరావు, బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీహరిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతిలు అభినందించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z