స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ ఉన్న నారా చంద్రబాబునాయుడును (Chandrababu) ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) కలిసేందుకు (ములాఖత్) అనుమతి నిరాకరించారు. అనుమతి తిరస్కరణపై జైళ్ల ఉపశాఖాదికారి ప్రకటన విడుదల చేశారు.ఈ రోజు నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్న ములాఖత్‌ను తిరస్కరించటం వాస్తవమేనని, రిమాండ్ ముద్దాయికి ఒక వారంలో రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మూడవ ములాఖత్ మంజూరు చేస్తారని తెలిపారు. భువనేశ్వరి అత్యవసర కారణాలను దరఖాస్తులో ప్రస్తావించకపోవటం వల్ల మూడో ములాఖత్ తిరస్కరించామని జైళ్ల అధికారి పేర్కొన్నారు.
చంద్రబాబుకు వారానికి రెండు ములాఖాత్‌లు మాత్రమే
Related tags :