Business

అమెజాన్‌ 2.5 లక్షల ఉద్యోగాలు

అమెజాన్‌ 2.5 లక్షల ఉద్యోగాలు

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ( Amazon) పండుగ సీజన్‌ కోసం యూఎస్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. కస్టమర్లకు ఉత్పత్తులు కొనుగోలు చేసిన మరుసటి రోజే డెలివరీని అందించే లక్ష్యంతో అమెజాన్‌ హాలిడే షాపింగ్ సీజన్ కోసం 2,50,000 యూఎస్‌ వర్కర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించింది. ఇది గత రెండేళ్లలో నియమించుకున్న ఉద్యోగుల సంఖ్య కంటే 67 శాతం ఎక్కువ.

హాలిడే సీజన్‌ కోసం అమెజాన్‌ దూకుడుగా వెళ్తుంటే మరోవైపు యూఎస్‌లోని ఇతర రిటైలర్‌ల ప్రణాళికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 2023 సంవత్సరంలో అమ్మకాలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో తమ స్టోర్లు, వేర్‌హౌస్‌లలో నియామకాలను తగ్గించినట్లు రాయిటర్స్‌ కథనం పేర్కొంది. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ సంవత్సరం హాలిడే అమ్మకాలు గత సంవత్సరం కంటే సగానికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.