NRI-NRT

ఆకట్టుకున్న ఆటా జానపద సాహిత్యవేదిక

ఆకట్టుకున్న ఆటా జానపద సాహిత్యవేదిక

అంతర్జాల వేదికగా అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆదివారం అక్టోబర్ 1, 2023న “తెలంగాణ జానపద సాహిత్యం” అనే అంశంపై విశ్లేషణాత్మకమైన కార్యక్రమం నిర్వహించింది. సాహిత్య విభాగం అధిపతి శారద సింగిరెడ్డి, మాధవి దాస్యం, రవి తుపురాని, వీరన్న పంజాలలు సమన్వయపరిచారు. కార్యక్రమానికి నంది శ్రీనివాస్ సంచాలకత్వం వహించారు. యువ జానపద కళాకారులు బొడ్డు దిలీప్ కుమార్, నక్క శ్రీకాంత్, ముకుందలు ప్రసంగించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని సాహిత్యానికి మూలం జానపద సాహిత్యమని కొనియాడారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ కులపతి, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అమెరికాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆటా తదుపరి అధ్యక్షుడు చల్లా జయంత్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వచ్చే జూన్‌లో నిర్వహించే ఆటా సదస్సులో పాల్గొనవల్సిందిగా కోరారు.