ScienceAndTech

రాజ్యోత్సవ అవార్డుకు ఇస్రో ఛైర్మన్‌ ఎంపిక

రాజ్యోత్సవ అవార్డుకు ఇస్రో ఛైర్మన్‌ ఎంపిక

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌కు కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు(Rajyotsava award)ను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను ఆయనతో పాటు 68మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించే వారికి గౌరవ సూచకంగా ఏటా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంటుంది. కర్ణాటకలో రెండో అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ఈ అవార్డుల్ని నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రదానం చేస్తారు.ఈ ఏడాది వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 68 మందితో పాటు 10 సంస్థలకు కూడా ఈ పురస్కారాలను ఇవ్వనున్నట్లు కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్‌ తంగడగి వెల్లడించారు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేసే సమయంలో ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది పురస్కారాలకు ఎంపికైన వ్యక్తులు, సంస్థల జాబితాలో 13 మంది మహిళలు, 64 మంది పురుషులు, ఒక హిజ్రా ఉన్నట్లు వివరించారు. ఈ పౌర పురస్కారం కింద రూ.5లక్షల నగదుతో పాటు 25 గ్రాముల బంగారు పతకాన్ని అందించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z