NRI-NRT

అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి

అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి

అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న ఖమ్మం నగరానికి చెందిన విద్యార్థిపై దుండగుడు కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. యువకుడి తండ్రి రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మం మామిళ్లగూడెంలో ఉన్న పుచ్చా వరుణ్‌రాజ్‌(29) ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. మంగళవారం జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో కణతపై పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని ఆసుపత్రిలో ఉన్నారు. వైద్యులు వరుణ్‌కు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని చెప్పాడు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి మంగళవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z