ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం రాష్ట్ర ఉత్సవంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.15 గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం ఏ కన్వెన్షన్ సెంటర్‌కు బయలుదేరి వెళ్తారు. కాగా, అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్‌పీలు పాల్గొంటారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
అమరజీవికి నివాళులర్పించండి….ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఏపీలోని ఆర్యవైశ్యులంతా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు, చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య వేల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య సంఘాలు, వాసవీ క్లబ్స్, పొట్టి శ్రీరాములు సంస్థ సభ్యులు, ఇతర ఆర్యవైశ్య అనుబంధ సంస్థలు ఈ వేడుకల్లో పాలుపంచుకోవాలని మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
👉 – Please join our whatsapp channel here –