ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు నవంబర్ 1 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
విద్యార్హతలు: బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్సీ) సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి. లేదా ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు నవంబర్ 30 నాటికి 27 ఏళ్లు మించరాదు.
నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలు, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఇతరులకు సడలింపు ఉంటుంది.
ఆన్లైన్ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తారు.
వేతన శ్రేణి: రూ.40 వేలు నుంచి 1,40,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుం: ఇతరులకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఎలాంటి రుసుం చెల్లించనవసరంలేదు.
👉 – Please join our whatsapp channel here –