Politics

ఏపీలో కొత్త పార్టీ

ఏపీలో కొత్త పార్టీ

ఏపీలో మరొక కొత్త పార్టీ ప్రారంభమైంది. ఏపీ పెన్షనర్స్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.సుబ్బారాయన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సుబ్బరాయన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఒక రాజకీయ వేదిక ఉండాలనే ఆలోచనతో పెన్షనర్స్ పార్టీ పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మా పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందని సుబ్బరాయన్ అన్నారు. పెన్షనర్ల ప్రయోజనాలను ప్రభుత్వం కాల రాస్తోందన్నారు. మా మెడికల్ బిల్లులు, సకాలంలో పెన్షన్ లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందన్నారు.

‘‘ఉద్యోగులను పట్టించుకోరు.. పెన్షనర్లను పట్టించుకోరు. రైతులను పట్టించుకోరు, నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలు, కళాశాలలు తయారయ్యాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు.. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? ఉపాధ్యాయులను సారా దుకాణాల్లో పని చేసే వారిలా మారుస్తోంది. సమస్యలను చెప్పుకోవడానికి హోం మంత్రి అందుబాటులో ఉండరు.

మధ్యవర్తి కి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో ఉంది. మా దూరదృదృష్టం ఐఆర్ పేరిట జీతాల్లో కోత పెట్టింది. రిటైర్ అయిన వాళ్లకు క్వాంటమ్ పెన్షన్‌లో కోత పెట్టింది. వైసీపీ లాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే స్థితిలో ఉద్యోగులు, పెన్షనర్లు లేరు. మా సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తాం. త్వరలో రాష్ట్ర వ్యాప్త పెన్షనర్ల సదస్సు నిర్వహిస్తాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మేధావుల మౌనం ఈ రాష్ట్రానికి మంచిది కాదు. మాట్లాడడండి మీకు అండగా పెన్షనర్స్ పార్టీ ఉంటుంది’’ అని సుబ్బరాయన్ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z