Movies

భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం

భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం

‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ నటుడు విజయ్‌ తన అభిమానులను ఉద్దేశించి చెప్పారు. లోకేష కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన కొత్త చిత్రం ‘లియో’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘లియో’ విజయోత్సవ వేడుక బుధవారం రాత్రి నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. దాదాపు 10వేల మందికి పైగా అభిమానులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘నాపై ఇంత అభిమానం ఉంచుకున్న మీకు ఏదైనా తప్పకుండా చేయాలనుంది. చేస్తా. మీ కాలు చెప్పులా ఉండటానికి కూడా వెనుకాడను. ఇప్పుడేం జరిగినా పట్టించుకోకండా అందరూ ఓపిక పట్టండి. విజయాన్ని అందుకోవచ్చు అన్నారు. అలాగే ఓ పిట్టకథ చెబుతూ.. ‘ఇద్దరు వేటగాళ్లు అడవిలోకి వెళ్లారు. ఒకడు తన వద్ద ఉన్న బాణంతో కుందేలును గురుచూసి పట్టుకున్నాడు. ఇంకొకడు ఏనుగును లక్ష్యంగా చేసుకుని తన వద్ద ఉన్న ఆయుధాన్ని విసిరాడు. గురితప్పింది. ఉత్తచేతులతో ఇంటికి తిరిగొచ్చారు. నా దృష్టిలో కుందేలును పట్టుకున్న వ్యక్తి విజయం సాధించినట్టు కాదు. ఏనుగులాంటి పెద్ద లక్ష్యాన్ని ఛేదించాలని అనుకున్న వ్యక్తే గొప్పవాడు. అతను ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పొందుతాడంటూ’ కథ వినిపించాడు. ఇది రజనీకాంత్‌ను పరోక్షంగా విమర్శించినట్లేనని సినీవర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z