సలార్ పార్ట్ 1లో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం జీపులు, ట్యాంకులు, ట్రక్కులు సహా 750కి పైగా వాహనాలను ఉపయోగించారని తెలుస్తోంది. సలార్ యాక్షన్ సన్నివేశాల గురించి చిత్ర నిర్మాణ బృందం కొంత సమాచారాన్ని తాజాగా పంచుకుంది. సాలార్ షూటింగ్ కోసం 750కి పైగా వివిధ రకాల వాహనాలను ఉపయోగించామని కన్నడ మీడియాతో చిత్ర యూనిట్ పంచుకుంది. జీపులు, ట్రక్కులు సహా అనేక వాహనాలను షూటింగ్‌కు వినియోగించారు.
హాలీవుడ్ సినిమాలో లాగా భారీ యాక్షన్ సన్నివేశాలను సలార్ కోసం చిత్రీకరించారు. సినిమా కోసం భారీ యుద్ధ భూమినే నిర్మించారు. సినిమాలో అద్భుతమైన యాక్షన్ సిట్యుయేషన్స్‌ని చూపించేందుకు చిత్రబృందం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. KGF సిరీస్‌లో కనిపించిన విధంగా ప్రశాంత్ నీల్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను సలార్ పార్ట్ 1 లో రూపొందించాడని అది ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు.
సలార్ పార్ట్-2 ఎప్పుడంటే..?
ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా ఆరు నెలల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట. పార్ట్-2 ఏప్రిల్ 2024లో వేసవి సెలవుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమచారం. కానీ సలార్ పార్ట్ 1 విడుదలైన తర్వాత వెంటనే పార్ట్ 2 విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్. సలార్ పార్ట్-1 ఎండ్ కార్డ్‌లోనే పార్ట్-2 ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ప్రకటించే ఛాన్స్ ఉంది. పార్ట్-2 కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సలార్ పార్ట్-1 డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇక షారుక్ ఖాన్ నటించిన డుంకీ కూడా అదే సమయంలో విడుదల కానుంది.
👉 – Please join our whatsapp channel here –