NRI-NRT

నమీ వాక్‌కు నాట్స్ తోడ్పాటు

నమీ వాక్‌కు నాట్స్ తోడ్పాటు

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) మానసిక రోగులకు అమెరికాలో సేవలు అందిస్తున్న నేషనల్ అలయన్స్ ఆఫ్ మెంటల్ ఇల్‌నెస్ (నమీ) న్యూజెర్సీ విభాగం నిధుల సేకరణ కోసం నమీ వాక్స్ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి తోడ్పాటు అందించింది.

ఇటీవల పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ వాక్ నిర్వహించినట్లు నమీ వాక్స్ నిర్వాహకురాలు శుభ అన్నారు. నమీకి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, అధ్యక్షుడూ బాపు నూతి అన్నారు. 78 వేల డాలర్లు విరాళంగా సేకరించారు. ఈ కార్యక్రమంలో బిందు యలమంచిలి, రమణ యలమంచిలి, రాజ్ అల్లాడ, శ్రీహరి మందడి, శ్యామ్ నాళం, గంగాధర్ దేసు, అరుణ గంటి, గోపి కృష్ణ గుర్రం తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z