చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. ఈ రోజున శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడని, అతని ఆనందంలో అయోధ్య ప్రజలు నెయ్యి దీపాలను వెలిగించారని నమ్ముతారు.
సనాతన ధర్మంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను దీపాల పండుగ అని కూడా అంటుంటారు. ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు తెలుసా ఈ దీపావళి రోజునే శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడని నమ్ముతారు. రాముడి రాకతో ఆనందపడ్డ అయోధ్య వాసులు నెయ్యి దీపాలను వెలిగించారని చెప్తారు. ఇది దీపావళి పండుగకు దగ్గరగా ఉంటుంది.
పిండి దీపాలు: అమావాస్య తిథి తర్వాత రోజును చోటీ దీపావళి అంటారు. ఈ రోజున పిండి దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. మీకు తెలుసా? ఈ చోటీ దీపావళి నాడు యముడిని పూజిస్తారు. యముడికి పిండి దీపాన్ని వెలిగిస్తే నరకానికి వెళ్లరని నమ్ముతారు.అంతేకాదు పిండి దీపాన్ని వెలిగిస్తే యమదేవుడి కన్నుమన కుటుంబంపై ఉండదంటారు. అందుకే చాలా మంది తమ ఇళ్లల్లో పిండి దీపాన్ని ఖచ్చితంగా వెలిగిస్తారు. అయితే ఈ దీపాన్ని వెలిగించి మీ ఇంట్లోని ప్రతి మూలా తిప్పాలి. ఆ తర్వాత దీన్ని దక్షిణ దిశలో పెట్టాలి. ఎందుకంటే ఈ దిక్కునే యమదేవుడు ఉండాటని భావిస్తారు.
దీపావళి ప్రాముఖ్యత: సనాతన ధర్మం ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ దీపాల పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని, వినాయకుడని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. దీపావళి నాడు లక్ష్మీదేవి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన భక్తులకు శ్రేయస్సు, ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు.
👉 – Please join our whatsapp channel here –