Videos

గుంటూరు కారం’ ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

గుంటూరు కారం’ ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు అభిమానుల జాతర నేటి నుంచి మొదలైంది. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో వచ్చింది. నిజానికి ఈ ప్రోమో ముందే లీక్ అయింది. కొన్ని సెకెండ్ల బిట్ బయటకు వచ్చేసింది. అఫీషియల్‌గా విడుదలైన సాంగ్‌ ప్రోమోను వింటే మహేశ్‌ ఫ్యాన్స్‌కు డబుల్‌ మసాలా బిర్యానీనే అనేలా ఉంది. తమన్‌-త్రివిక్రమ్‌ కాంబోలో మ్యూజిక్‌ ఎలా ఉటుందో ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దిరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌ సెన్సేషన్‌ అని తెలిసిందే.ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..’ అంటూ మొదలైన సాంగ్​లో.. బిరియానీ, మసాలా లాంటి మాస్ పదాలు ఉన్నాయి. అయితే ఇది జస్ట్​ ట్రాక్ బీట్ మాత్రమే.. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్‌ నవంబర్‌ 7న విడుదల కానుంది. ప్రోమో కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నా తమన్‌ మ్యూజిక్‌ దుమ్ములేపాడు అని చెప్పవచ్చు. మంచి మసాలా బిర్యానీ తింటూ సాంగ్‌ను ఎంజాయ్‌ చేయవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది.

ఇటీవల చాలా సినిమాల నుంచి థమన్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్, పాటలు తరచు విమర్శలతో పాటు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఇలాంటివి ఏమీ తమన్‌ లెక్కచేయడు. నిజానికి తన వ్యవహారధోరణి, తత్వాన్ని బట్టి ఆలోచిస్తే తన మీద సోషల్‌ మీడియాలో ఏదో ప్రచారం జరిగితే డిస్టర్బ్ అయ్యే కేరక్టర్ కాదు… సోషల్ మీడియా తీరూతెన్నూ మొత్తం తెలిసినవాడే… అవసరమైతే సోవాట్ అని తేలికగా తీసుకోగలడు. గుంటూరు కారంతో ట్రోలర్స్‌కు ఎలాంటి ఛాన్స్‌ ఇవ్వలేదని తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z