కాంగ్రెస్, భారాస పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. జనాభాలో అధిక శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్, భారాస వైఖరి మార్చుకోవాలని.. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘బీసీ వర్గంమంతా భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా మా పార్టీకి మద్దతిస్తున్నారు. బీసీలకు భారాస కేవలం 23, కాంగ్రెస్ 19 సీట్లే ఇచ్చాయి. బీసీ నేతలు దిల్లీకి వెళ్తే అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానపరిచింది. రాష్ట్రంలో దాదాపు 50 శాతం బీసీలకు టికెట్లు ఇచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తోంది’’అని బండి సంజయ్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –