NRI-NRT

“ఆటా” 18వ మహాసభలకు ఘనంగా ఏర్పాట్లు

“ఆటా” 18వ మహాసభలకు ఘనంగా ఏర్పాట్లు

జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో జరగనున్న ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య, ఆధ్యాత్మిక, వ్యాపారం, వ్యవస్థాపకత, అవార్డులు, అంగళ్ళు, ఆరోగ్యం, నాయకత్వం, కళలు, మ్యాట్రిమోనీ, పేజంట్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు మూడు రోజులలో జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, నటులను, దర్శకులను, సాహితీ వేత్తలను, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలను, న్యాయ కోవిదులను, వివిధ రంగాలలో నిష్ణాతులను ఆటా నాయకత్వం ఆహ్వానించింది. సినీరంగం నుండి విజయ్ దేవరకొండ, జాహ్నవి కపూర్, మెహ్రీన్, శ్రీకాంత్, థమన్, అనూప్ రూబెన్స్, సందీప్ రెడ్డి వంగా, తనికెళ్ళ భరణి వంటి వారు హాజరవుతారు. మరిన్ని వివరాలకు – https://ataconference.org, టికెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registration ని చూడవచ్చు.

కాంగ్రెస్ మెన్ రిచ్ మెకార్మిక్, సెనేటర్ జాన్ ఆసాఫ్, స్టేట్ రెప్రెసెంటేటివ్ టాడ్ జోన్స్, కమీషనర్లు లారా సేమాన్సన్, ఆల్ఫ్రెడ్ జాన్, సిటీ కౌన్సిల్ దిలీప్ తున్కి, బాబ్ ఎర్రమిల్లి, నరేందర్ రెడ్డి, ఇంకా సిటీ మేయర్లు, తదితరులను ఆహ్వానించారు.

ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం, కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్, ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బూజాల, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు తదితరులు వేడుకల విజయవంతానికి కృషి చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z