Business

ఆఫ్రికాలోకి జియో-BusinessNews-May 27 2024

ఆఫ్రికాలోకి జియో-BusinessNews-May 27 2024

* ‘జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ణ్శే)’ తమ ట్రేడింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. రూ.250 కంటే తక్కువ ధర పలికే స్టాక్స్‌ టిక్‌ సైజ్‌ను ఒక పైసాకు కుదించింది. గతంలో ఇది ఐదు పైసలుగా ఉండేది. కొత్త మార్పు జూన్‌ 10 నుంచి అమల్లోకి రానుంది. ఇంతకీ టిక్‌ సైజ్‌ అంటే ఏంటి? టిక్ సైజు అనేది సెక్యూరిటీ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ ధరలో వచ్చే కనిష్ఠ మార్పు. స్టాక్‌ ధర మారగల అతి చిన్న పెంపును ఇది సూచిస్తుంది. దీన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిర్ణయిస్తుంది. ధరలో కచ్చితత్వం కోసం దీన్ని సవరించారు. టిక్‌ సైజ్‌ (టిచ్క్ శిజె) ఎంత తక్కువగా ఉంటే ధరలో అంత కచ్చితత్వం ఉంటుంది. తద్వారా ట్రేడర్లు మరింత తక్కువ ధరకు బిడ్లు దాఖలు చేయడం లేదా విక్రయించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల ట్రేడింగ్‌ వ్యయాలు సైతం తగ్గుతాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (శ్తొచ్క్ మర్కెత్) ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్‌.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ 22,900 ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 75,655.46 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,009.68 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 19.89 పాయింట్ల నష్టంతో 75,390.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు కోల్పోయి 22,932.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.13గా ఉంది.

* భారత టెలికాం మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో (ఋఎలీంచె ఝిఒ).. ఆఫ్రికాకూ విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఘనాకు చెందిన నెక్ట్స్‌-జెన్‌ ఇన్‌ఫ్రాకోతో (ణ్ఘీఛ్) చేతులు కలపనుంది. రిలయన్స్‌కు చెందిన ర్యాడిసిస్‌ కార్ప్‌తో ఎన్‌జీఐసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఘనాలో 5జీ అమలుకు కావాల్సిన మౌలిక వసతలను ఎన్‌జీఐసీ ఏర్పాటు చేయనుంది. అందుకు అవసరమయ్యే పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, అప్లికేషన్లను ర్యాడిసిస్‌ సమకూర్చనున్నట్లు ఎన్‌జీఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. భారత్‌లో జియో (ఝిఒ) అనుసరించిన వ్యూహాన్నే ఘనాలో అమలు చేయాలని ఎన్‌జీఐసీ భావిస్తున్నట్లు సమాచారం. 2016లో వచ్చిన జియో.. స్వల్ప కాలంలో భారత్‌లో అగ్రగామి టెలికాం ప్రొవైడర్‌గా అవతరించింది. ఉచిత వాయిస్‌ కాలింగ్‌, తక్కువ ధరకే డేటా వంటి మార్కెటింగ్‌ వ్యూహాలతో ప్రత్యర్థి సంస్థలకు చెక్‌ పెట్టింది. పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్‌, ఐడియా విలీనమయ్యాయి. ప్రస్తుతం దాదాపు 47 కోట్ల సబ్‌స్క్రైబర్లతో జియో తొలిస్థానంలో ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ఐ‌డియా తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.

* రెనర్జీ డైనమిక్స్ (ఋఏనెర్గ్య్ డ్య్నమిచ్స్) పునరుత్పాదక రంగంలోకి అడుగుపెట్టినట్లు సోమవారం ప్రకటించింది. కంపెనీ లార్జ్ స్కేల్ బయోఎనర్జీ ప్రాజెక్ట్‌లకు, ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ రంగానికి, ఫీడ్‌స్టాక్ అగ్రిగేషన్, కంప్రెస్డ్ బయోగ్యాస్ మొదలైనవి సంస్థలకు తన ఉత్పతులను విక్రయించనుంది. రెనర్జీ డైనమిక్స్ 2029 నాటికి వివిధ సంస్థల నుంచి రూ.5000 కోట్ల రూపాయల ఆర్డర్లను బుక్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ వివిధ దశల్లో రూ. 575 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z