NRI-NRT

అమెరికాలో యాదగిరిగుట్ట యువతి మృతి

అమెరికాలో యాదగిరిగుట్ట యువతి మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతురాలిని తెలంగాణకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిపల్లె. గ్రామస్థులు, కుటుంసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సౌమ్య చదువుతో పాటు పార్ట్‌టైం జాబ్‌ కూడా చేస్తున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో దూరం కావడంపై తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సౌమ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z