NRI-NRT

Day4-HTSL: కమనీయంగా కలియుగ దేవుని కళ్యాణం. సూర్యప్రభపై విష్ణు శోభ.

Day4-HTSL: కమనీయంగా కలియుగ దేవుని కళ్యాణం. సూర్యప్రభపై విష్ణు శోభ.

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో తొలిసారిగా నిర్వహిస్తున్న 2024 వార్షిక బ్రహ్మోత్సవంలో నాలుగో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం హోమం నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగింపుగా శోభిల్లాడు. భక్తులు పారవశ్యంతో దేవదేవుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సాయంత్రం స్థానిక సాంస్కృతిక కేంద్రంలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళీలు ఏర్పాట్లను సమీక్షించారు. మంగళవారం నాడు పుష్పయాగంతో అయిదురోజుల క్రతువు ముగుస్తుందని మీడియా కమిటీ ఛైర్మన్ సూరపనేని రాజా పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు దేవాలయ నిర్వాహకులు అయిదు రోజుల పాటు ఉచితంగా రెండు పూటలా హైందవ సాంప్రదాయ శాకాహార భోజనాన్ని వడ్డించారు. పలు స్థానిక భారతీయ సంఘాలు ఈ అన్నదాన కార్యక్రమానికి చేయూతనందించాయి. భోజన ఏర్పాట్లను ఇంటూరి శేషుబాబు, కాంతారావులు పర్యవేక్షించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z