NRI-NRT

దుబాయి ప్రవాసులతో లావు అంజయ్య భేటీ

దుబాయి ప్రవాసులతో లావు అంజయ్య భేటీ

తెలుగు అసోసియేషన్-యూఏఈ కార్యనిర్వాహక సభ్యులు దుబాయ్ లోని ఇండియన్ క్లబ్ లో తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తానా ద్వారా సుదీర్ఘ కాలంగా సేవలందించడానికి సంస్థాగత నిర్మాణం, వివిధ విభాగాల రూపకల్పన, సమన్వయం, కార్యక్రమాల నిర్వహణా విధానాలు, బోర్డు-ఎగ్జిక్యూటివ్ కమిటీల పరస్పర సహకారం, నిధుల సేకరణ వంటి అంశాలపై చర్చించారు.

యూఏఈ తెలుగు అసోసియేషన్ – తానా పరస్పర సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తెలుగు వారికి మరింత సేవా కార్యక్రమాలు చేసే అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. అనంతరం అంజయ్య చౌదరిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూఏఈ తెలుగు అసోసియేషన్ తరుపున ప్రస్తుత కార్య నిర్వాహక చైర్మన్ వివేకానంద్ బలుస, ప్రెసిడెంట్ మసివుద్దీన్, జనరల్ సెక్రటరీ విజయభాస్కర్, ట్రెజరర్ శ్రీనివాస్ గౌడ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ సురేంద్ర ధనేకుల, ఆంధ్రా సంక్షేమ విభాగ డైరెక్టర్ శ్రీధర్, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ భీం శంకర్ బంగారి, తెలంగాణ వెల్ఫేర్ విభాగ డైరెక్టర్ చైతన్య చకినాల, పూర్వ కార్యనిర్వాహక బృందం నుండి చైర్మన్ దినేష్ కుమార్ ఉగ్గిన, ట్రెజరర్ మురళి కృష్ణ నూకల, తెలంగాణ వెల్ఫేర్ విభాగ డైరెక్టర్ షేక్ షా వలి, శరత్ నల్లమోతు తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z