* ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు విధిస్తున్న బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది. బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్ బ్యాంక్‌కు రూ. 91 లక్షల జరిమానా విధించింది. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్‌లు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్‌బీఐ అమలు చేస్తోంది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సైతం ఆర్‌బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.
* ట్యాక్స్ పేయర్స్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు.
* దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 22,868 వద్దకు చేరింది. సెన్సెక్స్ 261 పాయింట్లు పుంజుకుని 75,128 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, హెసీఎల్ టెక్నాలజీస్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరాయి. పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టపోయాయి.
* స్పైస్‌జెట్ సంస్థ నుంచి రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్నట్లు ఆ సంస్థ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ తెలిపారు. ఇటీవల మారన్ నుంచి రూ.450 కోట్లు పరిహారం కోరతామని స్పైస్‌జెట్ వెల్లడించిన నేపథ్యంలో మారన్, ఆయన కంపెనీ కేఏఎల్ ఎయిర్‌వేస్ ఈ మేరకు ప్రకటన వెల్లడించారు. స్పైస్‌జెట్‌కు గతంలో ప్రమోటర్‌గా వ్యవహరించిన కళానిధి మారన్ సంస్థలో తన 58.46 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్ అజయ్‌సింగ్‌కు బదిలీ చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా తనకు రావాల్సిన వారంట్స్, షేర్లు జారీ చేయలేదని మారన్ ఆరోపించారు. ఈ వ్యవహారం కోర్టుకెళ్లింది. దీనిపై మధ్యవర్తిత్వ కోర్టు, దిల్లీ సింగిల్ బెంచ్ తీర్పులను అనుసరించిన స్పైస్‌జెట్.. మారన్, ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్‌వేస్‌కు రూ.580 కోట్లు అసలు, రూ.150 కోట్లు వడ్డీ చొప్పున రూ.730 కోట్లు చెల్లించింది. స్పైస్‌జెట్, కంపెనీ ప్రస్తుత ప్రమోటరు అజయ్‌సింగ్ మారన్‌కు రూ.580 కోట్లను వడ్డీతో పాటు చెల్లించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను సమర్థించిన ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ మే 17న దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. దాంతో కళానిధి మారన్, ఆయన సంస్థ కేఏఎల్ ఎయిర్‌వేస్‌కు చెల్లించిన రూ.730 కోట్ల మొత్తం నుంచి రూ.450 కోట్లు రీఫండ్ ఇవ్వాలని కోరనున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది. దాంతో మారన్ దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాససం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు తెలిపారు. ఎఫ్‌టీఐ కన్సల్టింగ్ ఎల్‌ఎల్‌పీ నిర్ణయించిన రూ.1323 కోట్ల నష్టాన్ని సైతం స్పైస్‌జెట్ నుంచి కోరనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z