Politics

ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు

ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు నగరంలోని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఆయనకు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరగనుంది. ఇప్పటికే రెండు సార్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఏఐజీకి వచ్చిన చంద్రబాబు ఒకరోజు ఇక్కడే ఉండి పలు వైద్యపరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లిన విషయం విదితమే. మళ్లీ సోమవారం ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు వైద్యుల బృందం వివిధ వైద్యపరీక్షలు చేయడంతో పాటు చర్మ సంబంధిత చికిత్స అందించినట్లు సమాచారం. నేడు క్యాటరాక్ట్‌ చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి ఆయన చేరుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z