మన దేశంలో పెళ్లంటే గొప్ప వేడుక. వధూవరుల కుటుంబాలు, బంధుమిత్రులు, వచ్చేపోయేవారితో పెళ్లి ఇంటికి వచ్చే కళే వేరు! మరి ఈ సీన్‌లోకి విదేశీయులు అతిథులుగా ఎంట్రీ ఇస్తే మరింత అద్భుతంగా ఉంటుంది కదూ! ఓ ఆస్ట్రేలియా వ్యక్తికి సరిగ్గా ఇలాంటి ఐడియానే తట్టింది. దాన్ని అమల్లో పెట్టేందుకు ఏర్పాటు చేసిన సంస్థకు మంచి స్పందన లభిస్తోంది. విదేశీయులను తమ పెళ్లిళ్లకు ఆహ్వానించే భారతీయులకు కొంత డబ్బు కూడా ఇస్తోందీ సంస్థ. ఇలా వినూత్న ఐడియాతో ముందుకొచ్చిన ఈ సంస్థ పేరు జాయిన్‌మైవెడ్డింగ్(Joinmywedding). హంగేరియన్-ఆస్ట్రేలియన్ వ్యక్తి ఓర్సీ పార్‌కేయినీ 2016లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం మంచి పాప్యులారిటీ సాధించింది.భారత్‌లో ప్రాంతాల్లో జరగబోయే పెళ్లిళ్లను ఈ సంస్థ తన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. విదేశీయులు తమకు కావాల్సిన ప్రాంతంలో జరిగే పెళ్లిని ఎంచుకుని, పెళ్లివారు అంగీకరిస్తే ఎంచక్కా వెళ్లొచ్చు(Foreigners as guests in indian weddings). అయితే, ఇందుకోసం వారు 150 నుంచి 200 డాలర్ల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని నూతన వధూవరులకు బహుమతిగా అందజేస్తారు. తరువాత, విదేశీయులు ఆయా వివాహాలకు హాజరై అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పెళ్లివారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఎంజాయ్ చేయచ్చు
ఈ ఐడియా బాగా హిట్టవడంతో అనేక మంది విదేశీయులు క్యూకడుతున్నారు. ‘‘ఇండియాలో నాకు దక్కిన అత్యద్భుతమైన అనుభవం ఇదే. ఇక్కడి ఫుడ్, స్థానికులు, ఆ సంస్కృతి అన్నీ దగ్గరుండి చూడగలిగాను’’ అని ఇటీవల ఓ పెళ్లికి హాజరైన ఆస్ట్రేలియా వ్యక్తి డా. క్రిస్టాఫ్ ప్లెమ్ పేర్కొన్నారు. ‘‘స్థానికులతో కలిసి మెలిసి తిరుగుతూ కొత్త స్నేహాలు పెంపొందించేందుకు ఇది అద్భుతమైన అవకాశం’’ అని ఐర్లాండ్‌కు చెందిన నియాంమ్ కెల్లీ వ్యాఖ్యానించారు. నెటిజన్లు కూడా ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అద్భుతమైన ఐడియా అంటూ కితాబిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –