Movies

చంద్రమోహన్ ఇకలేరు

చంద్రమోహన్ ఇకలేరు

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (80) (Chandramohan) ఇకలేరు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. పదహారేళ్ల వయసు, సిరిసిరి మువ్వ సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z