Devotional

నేటి రాశి ఫలాలు-13-11-2023

నేటి రాశి ఫలాలు-13-11-2023

🐐 మేషం

మిశ్రమకాలం. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

🐂 వృషభం

తలపెట్టిన కార్యాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలున్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీవెంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

💑 మిధునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. దుర్గాస్తుతి పఠించడం మంచిది.

🦀 కర్కాటకం

చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగించే అవకాశం ఉంది. అధైర్యపడకుండా ముందుకు సాగితేనే మేలైన ఫలితాలు చేకూరుతాయి. దుర్గారాధన శుభాన్నిస్తుంది.

🦁 సింహం

పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

💃 కన్య

సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవతాస్తోత్రము పఠించడం మంచిది.

⚖ తుల

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో మీపై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్య స్తుతి మేలుచేస్తుంది.

🦂 వృశ్చికం

మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మి ధ్యానం మంచినిస్తుంది.

🏹 ధనుస్సు

చక్కని కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళితే మంచి జరుగుతుంది. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

🐊 మకరం

ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శుభఫలితాలు పొందడానికి వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి.

🏺 కుంభం

కార్యజయం ఉంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలుంటాయి. ధన లాభం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

🦈 మీనం

పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. గణపతి ఆరాధన శుభప్రదం.