Politics

కేటీఆర్ రోడ్ షో విజయవంతం

కేటీఆర్ రోడ్ షో విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పరిగి నియోజ కవర్గంలోని కులకచర్లలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో సక్సెస్‌ కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం పెంపొందింది. కులకచర్లలో కేటీఆర్‌ రోడ్‌షో సోమవారం మధ్యా హ్నం మూడు గంటలకు ఉంటుందని పేర్కొనగా ఒంటి గంట నుంచే రోడ్‌షో ప్రాంతానికి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం ప్రారంభమైంది. పరిగి ఎమ్మెల్యే, బీఆర్‌ ఎస్‌ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్‌, మహ్మదాబాద్‌, గండీడ్‌ మండలాల నుంచి భారీ జన సమీ కరణ చేపట్టారు. ప్రతి గ్రామం, గిరిజన తండాల నుంచి పెద్ద సంఖ్యలో కేటీఆర్‌ రోడ్‌షోకు జనం తరలివచ్చారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో రోడ్‌ షోకు హాజరవడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ప్రసంగంలో పలు అంశాలపై మాట్లాడినపుడు సభికుల నుంచి చక్కటి స్పందన కనిపించింది.

ఒక దశలో సీఎం, సీఎం అంటూ నినా దాలు చేయగా సీఎం ఖమ్మంలో ఉన్నారంటూ కేటీఆర్‌ చెప్పారు. రోడ్‌షో సందర్భంగా కులకచర్ల పెద్ద గేటు చౌరస్తా జన సంద్రంగా మారింది. ఈ సందర్భంగా పరిగి కాంగ్రెస్‌ నాయకుడిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సభికుల నుంచి మద్దతు లభించింది. మరోవైపు రోడ్‌షో సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్‌ హరీశ్వర్‌రెడ్డి ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన మొదటి నాయకుడని చెప్పడంతో హర్షధ్వానాలు చేశారు. ఈసారి మహేశ్‌ రెడ్డిని గెలిపించండి గండీడ్‌, మహ్మదాబాద్‌ మండలాలను వికారాబాద్‌ జిల్లాలో కలిపి స్తానని చెప్పడంతో ఈ రెండు మండలాల పరిధిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరింత మైలేజ్‌ రానుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే సంవత్సరం లోపు కృష్ణా నీటిని తీసుకువచ్చి బీడు భూములు తడుపుతామని కేటీఆర్‌ హామీ ఇవ్వడంతో రైతాంగంలో చక్కటి స్పందన వచ్చింది. ఏదిఏమైనా కేటీఆర్‌ రోడ్‌షోతో పరిగి బీఆర్‌ఎస్‌కు మరింత ఊపు వచ్చిందని పేర్కొనవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z