Politics

తెదేపా-జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో

తెదేపా-జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో

తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ ముగిసింది. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా తెదేపా-జనసేన మేనిఫెస్టోపై భేటీలో కమిటీ చర్చించింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా తెదేపా నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్‌ ఉన్నారు. భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరు పార్టీల నేతలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నుంచి 6 అంశాలు, జనసేన నుంచి ప్రతిపాదించిన 5 అంశాలను చేర్చి ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు.

వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు తీసుకుని పూర్తి స్థాయి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తెలుగుదేశం – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పించే పథకాల ద్వారా యువతకు నమ్మకం కలిగించి ధైర్యం చెప్పే అంశాలను మినీ మేనిఫెస్టోలో ప్రతిపాదించామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

మినీ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలివే..

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ.

ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు.

అమరావతే రాజధానిగా కొనసాగింపు.

పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం.

అసమానతలు తొలిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన.

బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం.

రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం.

రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z