Politics

అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 18న అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు సోమాజిగూడలోని భాజపా మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం నల్గొండ, వరంగల్‌, గద్వాల్‌, రాజేంద్రనగర్‌ సభల్లో అమిత్‌ షా పాల్గొంటారని భాజపా వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా.. 18కి వాయిదా పడింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z