Business

బజాజ్ కి ఆర్బిఐ షాక్

రుణాలు ఆపేయమంటూ ఆర్బిఐ షాక్ లో బజాజ్

ప్రముఖ నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌కు (Bajaj Finance) ఆర్‌బీఐ షాకిచ్చింది. బజాజ్‌ ఫైనాన్స్‌కు చెందిన ఇ-కామ్‌ (eCOM), ఇన్‌స్టా ఈఎంఐ కార్డుల (Insta EMI Card) జారీ, వాటిపై రుణాల మంజూరును నిలిపివేయాలని ఆదేశించింది. డిజిటల్‌ రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆర్‌బీఐ ఈ ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.

బజాజ్‌ ఫైనాన్స్‌ అందిస్తున్న ఈ రెండు రుణ ఉత్పత్తుల కింద రుణగ్రహీతలకు వాస్తవ ప్రకటనలను జారీ చేయకపోవడాన్ని ఆర్‌బీఐ తప్పుబట్టింది. అలాగే కంపెనీ మంజూరు చేసిన ఇతర డిజిటల్ రుణాలకు సంబంధించి ప్రకటనల్లో లోపాలు ఉన్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. లోపాలు సరిదిద్దిన తర్వాత సమీక్షించి ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రుణ గ్రహీతల ప్రయోజనార్థం గతేడాది ఆగస్టులో ఆర్‌బీఐ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు బుధవారం బీఎస్‌ఈలో 1.84 శాతం మేర క్షీణించి రూ.7,223.95 వద్ద ముగిశాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z